Singam 4 : సింగం 4 ఎప్పుడు మొదలు? సూర్య-అనుష్క మరోసారి?
ఎప్పట్నుంచో ఈ సిరీస్ కి మరో సీక్వెల్ సింగం 4 ప్లాన్ చేయమని అభిమానులు, ప్రేక్షకులు కోరుతున్నారు. గతంలో సింగం 4 ఉంటుందని వార్తలు వచ్చినా మళ్ళీ దాని గురించే వినపడలేదు.

Singam 4 movie will starts soon again with suriya and anushka pair
Singam 4 : సూర్య(Suriya) కెరీర్ లో మాస్ అండ్ సూపర్ హిట్ సినిమాలు అంటే చెప్పుకోవాల్సింది సింగం సిరీస్. సింగం 1,2,3 సినిమాలు తెలుగు, తమిళ్(Tamil) లో సూపర్ హిట్ అయ్యాయి. ఇవి ఒకదానికి ఒకటి సీక్వెల్ సినిమాలు. మాస్ డైరెక్టర్ హరి(Director hari) దర్శకత్వంలో ఈ మూడు సినిమాలు వచ్చి భారీ విజయం సాధించాయి. ఈ మూడు సినిమాల్లో అనుష్కనే(Anushka) హీరోయిన్. మధ్యలో సింగం 2లో హన్సిక, సింగం 3లో శృతి హాసన్ కూడా చేసినా అనుష్క క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు.
ఎప్పట్నుంచో ఈ సిరీస్ కి మరో సీక్వెల్ సింగం 4 ప్లాన్ చేయమని అభిమానులు, ప్రేక్షకులు కోరుతున్నారు. గతంలో సింగం 4 ఉంటుందని వార్తలు వచ్చినా మళ్ళీ దాని గురించే వినపడలేదు. తాజాగా మరోసారి తమిళ సినీ పరిశ్రమలో సింగం 4 సినిమా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ బడ్జెట్ తో పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రాబోతుంది.
అయితే కంగువ సినిమా షూట్ అయిన తర్వాత సూర్య సింగం 4 మొదలుపెడతాడని సమాచారం. తమిళ్ మాస్ డైరెక్టర్, సింగం సిరీస్ దర్శకుడు హరినే సింగం 4కు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం హరి విశాల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అది అవ్వగానే సింగం 4 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారని సమాచారం. అలాగే ఈ సినిమాలో కూడా మరోసారి అనుష్కనే తీసుకోబోతున్నారట. అనుష్కతో పాటు ఇంకో హీరోయిన్ కూడా ఉండబోతుందట. దీంతో సూర్య అభిమానులు సింగం 4 సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.