Singer Kalpana : కల్పన ఏమో అలా.. ఆమె కూతురు ఇలా.. సింగర్ కల్పన కేసులో కూతురు ఏం చెప్పింది అంటే..

కల్పన కూతురు మాత్రం తాజాగా మీడియా ముందుకు వచ్చి మరోలా చెప్పింది.

Singer Kalpana Daughter Comments Regarding Her Mother

Singer Kalpana : నిన్న రాత్రి సింగర్ కల్పన తన ఇంట్లోనే అపస్మారక స్థితిలో ఉండటంతో పోలీసుల వరకు సమాచారం వెళ్లడంతో రాత్రి పోలీసులు ఆమెను హాస్పిటల్ లో చేర్పించారు. ఆమెకు ట్రీట్మెంట్ అనంతరం నేడు కల్పన స్పృహలోకి వచ్చింది. ఇప్పటికే పోలీసులు కల్పన దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు.

అయితే కల్పన.. కేరళలో ఉన్న తన పెద్ద కూతురిని చదువుకోడానికి హైదరాబాద్ రమ్మన్నాను అని, తాను రాను అని చెప్పిందని, తాను అక్కడే ఉంటాను అని చెప్పడంతో ఆవేదనతో నిద్ర మాత్రలు మింగి చనిపోవాలి అనుకున్నట్టు తెలిపింది. దీంతో కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలుస్తుంది.

Also Read : Artiste : ‘ఆర్టిస్ట్’ ట్రైలర్ చూశారా..? ఆర్టిస్ట్ అంటూ దారుణంగా మర్డర్లు..

అయితే కల్పన కూతురు మాత్రం తాజాగా మీడియా ముందుకు వచ్చి మరోలా చెప్పింది. కల్పన హాస్పిటల్ లో చేరిందని విషయం తెలిసి వెంటనే కేరళ నుంచి బయలుదేరి వచ్చింది ఆమె కూతురు. ఈ సందర్భంగా ఇప్పటికే పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. పోలీసులతో మాట్లాడిన అనంతరం కల్పన కూతురు మీడియాతో మాట్లాడింది.

కల్పన కూతురు మాట్లాడుతూ.. మా అమ్మకు ఎలాంటి సమస్యలు లేవు. ఆమె ఆరోగ్యంగా ఉంది. ఆమె సింగర్ మాత్రమే కాదు లాయర్ కూడా. ఆమె పీహెచ్డి చేస్తుంది. దానివల్ల మా అమ్మకు ఇన్సోమియా (నిద్రలేమి) వచ్చింది. ట్రీట్మెంట్ లో భాగంగా డాక్టర్ ఆమెకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. అవి ఓవర్ డోస్ అవ్వడం వల్ల ఇలా జరిగింది. స్ట్రెస్ ఎక్కువై ఎక్కువ మందులు తీసుకుంది. అంతేకాని ఇది ఆత్మహత్య కాదు. తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. కొని రోజుల్లో మా అమ్మ పూర్తి ఆరోగ్యంతో వస్తారు అని తెలిపింది.

Also Read : Singer Kalpana Health Update: కల్పన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..

దీంతో కల్పన ఏమో పోలీసులకు ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పినట్టు సమాచారం రాగా ఇప్పుడు ఆమె కూతురు ఏమో మెడిసిన్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలా జరిగింది అనడం గమనార్హం.