Manikya Vinayagam : ‘శంకర్ దాదా’ సింగర్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం

తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ్, తెలుగు గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్యంతో...........

Manikya Vinayagam :    ఇటీవల సినీ పరిశ్రమలో విషాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మరణం మరవకముందే మరో మరణం కలవరపెడుతుంది. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ్, తెలుగు గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు.

మాణిక్య వినాయగం తన మామయ్య అయిన గాయకుడు సీఎస్‌ జయరామన్‌ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. 2001 లో ‘దిల్‌’ అనే తమిళ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో గాయకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఈయన అన్ని భాషల్లో కలిపి దాదాపు 800లకిపైగా పాటల్ని పాడారు. అంతేకాక వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాల్ని కూడా ఆలపించారు.

Samantha : సమంత అరుదైన రికార్డ్.. టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ లో నంబర్ 1గా ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’

చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ సినిమాలో ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’ సాంగ్ తో ఈయనకి టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు వచ్చింది. గాయకుడిగానే కాకుండా తమిళ్ సినిమాల్లో నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించారు. మాణిక్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు