Sirivennela Seetharama Sastry : అభిమాని బ్లేడ్ తో చెయ్యి కోసుకొని బొట్టు పెడితే.. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఏం చేసారంటే..

తాజాగా ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Sirivennela Seetharama Sastry : అభిమాని బ్లేడ్ తో చెయ్యి కోసుకొని బొట్టు పెడితే.. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఏం చేసారంటే..

Singer Parthu Nemani Reveals a Situation about Sirivennela Seetharama Sastry

Updated On : November 7, 2024 / 11:16 AM IST

Sirivennela Seetharama Sastry : దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎన్నో అద్భుతమైన పాటలను మనకు అందించిన సంగతి తెలిసిందే. వేల పాటలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. తన పాటల సాహిత్యంతో జనాలను ఆలోచింపచేసారు. సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ ఈటీవి ఛానల్ నా ఉఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూలలో ఆయన గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు.

నా ఉఛ్వాసం కవనం ఇంటర్వ్యూని సింగర్ పార్థు నేమాని హోస్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Also Read : Anushka Shetty : అనుష్క ఘాటి ఫస్ట్ లుక్ రిలీజ్.. మరో కొత్త అవతారంలో స్వీటీ..

పార్థు నేమాని మాట్లాడుతూ.. ఆయన పాటలకు, ఆయన సాహిత్యానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఓ సారి ఆయన సన్మాన సభలో ఓ అభిమాని వచ్చి బ్లేడ్ తో చెయ్యి కోసుకొని రక్తంతో బొట్టు పెట్టాడు. దీంతో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి కోపం వచ్చి అతన్ని కొట్టి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని బాగా తిట్టారు. దానికి ఆ అభిమాని ఏం కాదు సర్, ఈ దేహం, ఈ జీవితం మీదే అంటూ మాట్లాడాడు అని తెలిపారు.