Rahul Sipligunj
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ సింగర్స్ లో రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) ఒకరు. నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ స్టేజి మీద కూడా పర్ఫార్మ్ చేసి వరల్డ్ వైడ్ ఫేమస్ తెచ్చుకున్నాడు. బార్బర్ ఫ్యామిలీ నుంచి వచ్చి బార్బర్ గా పనిచేస్తూ మ్యూజిక్ నేర్చుకొని ఇప్పుడు స్టార్ సింగర్ గా ఎదిగాడు రాహుల్. ప్రస్తుతం వరుస సినిమా సాంగ్స్ ఆఫర్స్ తో బిజీగా ఉంటూనే మధ్యమధ్యలో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడు.
Also Read : Ram Jagadeesh : సినిమా తీసి హిట్ కొట్టాడు.. పెళ్లి చేసుకున్నాడు..
ఇటీవలే రాహుల్ కి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా అందించింది. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ నిన్న ఆగస్టు 17వ తేదీన కేవలం కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యే హరిణి రెడ్డి అనే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే ఆ యువతి ఎవరు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.