Ram Jagadeesh : సినిమా తీసి హిట్ కొట్టాడు.. పెళ్లి చేసుకున్నాడు..

ఇటీవల కోర్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ జగదీశ్. రామ్ జగదీశ్ కోర్ట్ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు.(Ram Jagadeesh)

Ram Jagadeesh : సినిమా తీసి హిట్ కొట్టాడు.. పెళ్లి చేసుకున్నాడు..

Ram Jagadeesh

Updated On : August 18, 2025 / 2:37 PM IST

Ram Jagadeesh : ఇటీవల కోర్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ జగదీశ్. ఒక మంచి లవ్ స్టోరీతో పాటు ఒక మంచి మెసేజ్ ఇస్తూ కోర్ట్ రూమ్ డ్రామాగా కోర్ట్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు జగదీశ్(Ram Jagadeesh). నాని నిర్మాణంలో కేవలం 8 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పెద్ద హిట్ అయింది.

రామ్ జగదీశ్ కోర్ట్ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత తాజాగా పెళ్లి చేసుకున్నాడు. నటుడు శివాజీ డైరెక్టర్ రామ్ జగదీశ్ రిసెప్షన్ కి హాజరయి కొత్త దంపతులను ఆశీర్వదించాడు. శివాజీ జగదీశ్ జంటతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో పలువురు ఈ డైరెక్టర్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Rao Bahadur : సత్యదేవ్ ‘రావ్ బహదూర్’ టీజర్ రిలీజ్.. ఇదేదో కొత్తగా ఉందే.. మహేష్ బాబు మంచి కాన్సెప్ట్ పట్టాడుగా..

నటుడు శివాజీ కోర్ట్ సినిమాలో మంగపతి క్యారెక్టర్ తో విలనిజం అదరగొట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Sivaji sontineni (@actorsivaji_)

 

Also Read : Mouli Tanuj Prasanth : ‘మా అప్పులన్నీ తీర్చేసా.. నాన్న ఆటో నడుపుతూ..’ నువ్వు గ్రేట్ బ్రో..