Singer Saketh : చిన్నప్పుడు హార్ట్ లో హోల్.. పెద్దయ్యాక వెన్నెముక సర్జరీ.. అందర్నీ నవ్వించే సింగర్ సాకేత్ లో ఇన్ని బాధలు ఉన్నాయా?

తాజాగా సింగర్ సాకేత్ ఆహా కాకమ్మ కథలు షోకి గెస్ట్ గా రాగా ఈ షోలో చిన్నప్పటి నుంచి తనకున్న హెల్త్ సమస్యల గురించి చెప్పుకొచ్చాడు.

Singer Saketh : చిన్నప్పుడు హార్ట్ లో హోల్.. పెద్దయ్యాక వెన్నెముక సర్జరీ.. అందర్నీ నవ్వించే సింగర్ సాకేత్ లో ఇన్ని బాధలు ఉన్నాయా?

Singer Saketh Tells about his Health Issues from Childhood

Updated On : May 10, 2025 / 2:41 PM IST

Singer Saketh : తన సాంగ్స్ తో అందర్నీ అలరించే సింగర్ సాకేత్ టీవీ షోలలో తన కామెడీతో కూడా అందర్నీ మెప్పిస్తాడు. ప్రస్తుతం సినిమా సాంగ్స్, టీవీ షోలు, బయట ఈవెంట్స్ తో ఫుల్ బిజీగానే ఉన్నాడు. సాకేత్ ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని మ్యూజిక్ ఇండస్ట్రీలో అందరూ చెప్తారు. అయితే అందర్నీ అంతలా నవ్వించే సాకేత్ లో కూడా చాలా బాధలు ఉన్నాయి.

తాజాగా సింగర్ సాకేత్ ఆహా కాకమ్మ కథలు షోకి గెస్ట్ గా రాగా ఈ షోలో చిన్నప్పటి నుంచి తనకున్న హెల్త్ సమస్యల గురించి చెప్పుకొచ్చాడు.

Also Read : Singer Parnika : ఆ సమయంలో నా వాయిస్ పోయింది.. డిప్రెషన్ లోకి వెళిపోయా..

సింగర్ సాకేత్ మాట్లాడుతూ.. నేను హిమాటోమా అనే సమస్యతో పుట్టాను. లెఫ్ట్ భుజం, తల అటాచ్ అయి పుట్టాను. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు బాడీ ఒకవైపు పెరిగి ఇంకోవైపు పెరగదు. 30 ఏళ్ళ లోపు చనిపోతారు. ఆపరేషన్ చేసినా 70 శాతం ఛాన్స్ లేదన్నారు. కానీ ఇవాళ ఇలా ఉన్నాను. అలాగే 7 వ తరగతిలో ఉన్నప్పుడు హార్ట్ లో ఒక చిన్న హోల్ వచ్చింది. ఆ ఆపరేషన్ అయింది. 5 ఏళ్ళ క్రితం పెద్ద యాక్సిడెంట్ అయి వెన్నుముకకు భారీ గాయం అయింది. దానికి చాలా ఖర్చు అయింది అని తెలిపాడు. దీంతో సాకేత్ లైఫ్ లో హెల్త్ పరంగా ఎన్ని సమస్యలు చూశాడో, అవన్నీ దాటుకొని ఇప్పుడు చక్కగా పాడుతూ అందర్నీ నవ్విస్తున్నాడు అని అభినందిస్తున్నారు.

Also See : Surekhavani : కూతురితో కలిసి నటి సురేఖవాణి పుట్టిన రోజు వేడుకలు.. ఫోటోలు చూశారా?