SP Sailaja – Pawan Kalyan : ఆయన చేసే దాంట్లో తప్పేముంది.. చేతనైతే సహాయం చేద్దాం.. పవన్ కళ్యాణ్ పై సింగర్ ఎస్పీ శైలజ వ్యాఖ్యలు..

తాజాగా ఓ ఈవెంట్ లో సింగర్ ఎస్పీ శైలజను ప్రస్తుతం జరుగుతున్న వివాదం, పవన్ కళ్యాణ్ గురించి స్పందించమని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా..

Singer SP Sailaja Interesting Comments on Pawan Kalyan goes Viral

SP Sailaja – Pawan Kalyan : ప్రస్తుతం లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ నిలబడి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తుండగా, ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్ లో సింగర్ ఎస్పీ శైలజను ప్రస్తుతం జరుగుతున్న వివాదం, పవన్ కళ్యాణ్ గురించి స్పందించమని ఓ మీడియా ప్రతినిధి అడిగారు.

Also Read : Devara Movie : రేపే ‘దేవర’ రిలీజ్.. దేవర గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

ఈ క్రమంలో సింగర్ శైలజ మాట్లాడుతూ.. ఎవరి ధర్మం వాళ్లకు ముఖ్యం. ఆయన ఇది నా ధర్మం అనుకోని చేస్తున్నారు. మధ్యలో మనం వేలెత్తి చుపించాల్సింది ఏం లేదు. ఆయన ఇలా చేస్తే నా స్వామికి ప్రక్షాళన అవుతుందని భావించి చేస్తున్నారు. ఆయన నమ్ముతున్నారు. దాంట్లో తప్పేముంది. చేతనైతే సహాయం చేద్దాం లేకపోతే దూరం నుంచి చూడండి. ఇందులో వివాదాలు లేవు. అంతా దేవుడు చూసుకుంటాడు అని అన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.