Singer Sunitha Comments on Singer Pravasthi Allegations on Padutha Theeyaga Show
Sunitha : నిన్న సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా షోలో కొన్ని జరుగుతున్నాయి, అవి మీకు తెలియాలి అంటూ ఆ షో గురించి, షో నిర్మాతల గురించి, షో జడ్జీల గురించి తీవ్ర ఆరోపణలు చేసింది. షోలో బాడీ షేమింగ్ చేస్తున్నారని, ఎక్స్ పోజింగ్ చేయమన్నారని, బలవంతంగా డ్యాన్సులు చేయమన్నారని, తన పాటల్లో కావాలని తప్పు వెతికేవాళ్ళని, అడిగిన పాటలు ఇవ్వలేదని, సునీత మా అమ్మతో సీరియస్ గా మాట్లాడింది అని.. ఇలా పలు రకాల ఆరోపణలు చేసింది. దీంతో ప్రవస్తి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజాగా సింగర్ సునీత ప్రవస్తి ఆరోపణలపై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
Also Read : Vijayashanthi : రెండు గంటలు బురదలో.. బాడీ వణికిపోయింది.. 58 ఏళ్ళ వయసులో సినిమా కోసం విజయశాంతి కష్టాలు..
ఈ వీడియోలో సునీత మాట్లాడుతూ.. నేను కూడా నిన్ను చిన్నప్పటి నుంచి చూసాను. చిన్నప్పుడు పాడినట్టు ఇప్పుడు కూడా పాడి ఉంటే నేను సంతోషిస్తాను. మా ప్రవస్తి ఇవాళ రోడ్ మీదకు వెళ్లి మా గురించి చర్చించే స్థాయికి వెళ్ళింది అంటే అసంతృప్తిగా ఉంది. తను ఇచ్చిన పాటలు తీసుకోలేదు అంటుంది. కానీ ఛానల్స్ కి మ్యూజిక్ కాపీ రైట్స్ ఉంటాయి. వాటిని బట్టే పాటలు సెలెక్ట్ చేసుకుంటారు. నువ్వు ప్రతిదానికి అప్సెట్ అవుతావు, ఇరిటేట్ అవుతావు. ఒక రౌండ్ లో నువ్వు అలా ఉంటే నేను నీకు వచ్చి జాగ్రత్తలు చెప్పాను. నా సంస్థలో నువ్వు నా ఫేవరేట్ అన్నవాళ్ళని తీసుకోలేదు కానీ నేను నిన్ను తీసుకొని సాంగ్ చేశాను. నువ్వు, మీ అమ్మ ఇంటికి సింగిల్ గా వెళ్తున్నారని మిమ్మల్ని జాగ్రత్తగా పంపించడానికి మేము చూసుకున్నాం.
కీరవాణి గారు పెళ్లిలో సాంగ్స్ పాడటం గురించి మాట్లాడితే నిన్నే అనుకుని నువ్వు ఫీల్ అయ్యావు. మీ అమ్మ కూడా అక్కడ చాలా డ్రామా చేసింది. నా మొహం మీద చెయ్యి పెట్టి నన్ను తిట్టారు నా వల్లే అని. ఒక ఓటమిని అంగీకరించలేకపోతున్నారు నువ్వు, మీ అమ్మగారు. ఆ రోజు మీరు చాలా ఎమోషనల్ గా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు అని మేము మాట్లాడలేదు. అక్కడ జరిగింది అంతా అక్కడ కెమెరాల్లో రికార్డ్ అయింది. త్వరలో జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడతారు. నేను ఒకరు ఓడిపోతే సంతోషించే రకం కాదు. మీ అమ్మ గారు శాపనార్థాలు కూడా పెట్టారు. నువ్వే ఓటమిని ఎక్కువగా ఊహించుకొని ఇలా అంటున్నావు. ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. పేరెంట్స్ కూడా మంచి చెప్పాలి అని అన్నారు.
Also Read : Gaddar Awards : గద్దర్ అవార్డులు ఇచ్చేది ఆ రోజే.. త్వరలో సీఎం చేతుల మీదుగా గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణ..
అయితే ప్రవస్తి ఆల్రెడీ నేను ఎలిమినేట్ అయ్యాక మాట్లాడుతున్నాను అని కూడా అంటారు. అక్కడ ఉన్నప్పుడు ఏమి మాట్లాడలేము. ఇప్పుడు నేను నాకు ఇష్టమైన మ్యూజిక్ కెరీర్ కూడా వదిలేస్తున్నాను. ఇలాంటి వాళ్ళ పేర్లు బయటపెట్టినందుకు నాకు ఛాన్సులు రాకుండా చేస్తారు అని కూడా చెప్పింది. వీటిపై సునీత స్పందించలేదు. నిర్మాణ సంస్థ, ఎక్స్ పోజింగ్, బాడీ షేమింగ్ లాంటి వాటిపై కూడా స్పందించలేదు. సునీత కేవలం తన మీద చేసిన ఆరోపణల వరకే స్పందించింది. త్వరలో జ్ఞాపిక ప్రొడక్షన్స్ కూడా ప్రవస్తి వ్యాఖ్యలపై స్పందిస్తారని తెలుస్తుంది.