Singer Sunitha : హీరోగా సింగర్ సునీత కొడుకు?

సునీత కొడుకుని హీరోగా పరిచయం చెయ్యడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం..

Singer Sunitha

Singer Sunitha: టాలీవుడ్ పాపులర్ అండ్ సీనియర్ సింగర్ సునీత ఉపద్రష్ట తనయుడు ఆకాష్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సునీత కొడుకుని హీరోగా పరిచయం చెయ్యడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం.

Singer Sunitha: అరటి తోటలో సింగర్‌ సునీత.. వీడియో వైరల్‌

19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు (పాప-బాబు) పుట్టిన తర్వాత కొంతకాలానికి భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కెరీర్ కొనసాగిస్తూనే పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారామె.

 

పిల్లలు పెద్దవాళ్లు కావడంతో, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల సలహాతో ఇటీవలే సునీత, డిజిటల్ మీడియాలో కీలకపాత్ర పోషిస్తున్న రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్నారు. సునీత పిల్లలిద్దరూ కూడా స్టడీస్‌లో జెమ్స్. తల్లి సింగర్ కావడం, తండ్రి కూడా పలు టీవీ షోలు డైరెక్ట్ చేయడంతో ఆకాష్‌కి చిన్నప్పటినుంచి సినిమాల మీద ఆసక్తి ఉందని.. ప్రస్తుతం హీరోగా లాంచ్ అవడానికి కావలసిన శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

Ram Veerapaneni : గౌడ్ కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పిన సునీత భర్త