×
Ad

Sirivennela : సిరివెన్నెల రాసిన చివరి రెండు పాటలు ఇవే..

సిరివెన్నెల సీతారామ‌ శాస్త్రి చివ‌ర‌గా నాని నటించిన సినిమా కోసం రెండు పాటలు రాశారు..

  • Published On : November 30, 2021 / 05:49 PM IST

Sirivennela Shyam Singha Roy

Sirivennela: తన పదాలతో తెలుగు సాహిత్యానికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చి.. తన పద ప్రయోగంతో తెలుగు సినిమా పాటలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో కన్నుమూశారు.

Sirivennela Sitarama Sastri : ‘సిరివెన్నెల’ సినీరంగ ప్రవేశం..

సిరివెన్నెల సీతారామ‌ శాస్త్రి చివ‌ర‌గా నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన ‘శ్యామ్ సింగ‌ రాయ్’ సినిమాలో రెండు పాట‌లు రాశారు. అవే ఆయన రాసిన చివ‌రి పాట‌లు కావ‌డం విషాద‌క‌రం. దీంతో మూవీ టీం ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ.. సిరివెన్నెలకు సంతాపం తెలియజేశారు.

Sirivennela Sitaramasastri : సిరివెన్నెల రాసిన నిప్పుకణికలాంటి ఆ పాట ఒక్కసారి గుర్తు చేసుకోండి

మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యం విషయంలో తనతో తానే పోటీ పడేవారాయన. తెలుగు పాటలతో పరిచయమున్న ప్రతి ఒక్కరికీ సిరివెన్నెల సుపరిచితులే. భౌతికంగా సిరివెన్నెల మన మధ్య లేకపోయినా వేలాది పాటల్లో ఎప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంటారు. వినిపిస్తూనే ఉంటారు.

Sirivennela Sitaramasastri : సిరివెన్నెలను ఇంటిపేరుగా మార్చిన పాట ఇదే..!