Sirivennela Sitaramasastri : సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తుదిశ్వాస విడిచారు. ఈ నెల 24న అస్వస్థతకు గురైన సీతారామశాస్త్రిని కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
- kunduru Vinod
- Published On : November 30, 2021 / 04:20 PM IST
Sirivennela Sitaramashashtri
Sirivennela Sitaramasastri :గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తుదిశ్వాస విడిచారు. ఈ నెల 24న అస్వస్థతకు గురైన సీతారామశాస్త్రిని కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 07 నిమిషాలకు మృతి చెందారు. ఆయన మృతిని వైద్యులు ధ్రువీకరించారు.
ఈ నెల 24న ఆసుపత్రిలో చేరిన సీతారామశాస్త్రికి వైద్యులు పరీక్షలు నిర్వహించి న్యుమోనియాతో బాధపడుతున్నట్లుగా తేల్చారు. ఆరు రోజులుగా ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. సిరివెన్నెల మృతితో ఆయన అభిమానులు, శోకసంద్రంలో మునిగిపోయారు. తెలుగు సినీపరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
చదవండి : SiriVennela : సీతారామశాస్త్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవం
