SiriVennela : సీతారామశాస్త్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవం
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి కేవలం న్యుమోనియాతోనే బాధపడుతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి......

Sirivennela
SiriVennela : గత రెండు రోజులుగా ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థకు గురయ్యారని, ఆయన ఆరోగ్యం విషమించింది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి కేవలం న్యుమోనియాతోనే బాధపడుతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Suresh Babu : ఏపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల థియేటర్స్ కంటే ఓటిటినే సేఫ్ అంటున్న స్టార్ ప్రొడ్యూసర్
రెండు రోజుల క్రితమే సిరివెన్నెల కిమ్స్‌లో చేరినట్టు తెలుస్తోంది. ఆయన గత కొన్ని రోజుల నుంచి న్యుమోనియాతో బాధపడుతున్నారు. దీంతో చికిత్స తీసుకునేందుకే ఆయన కిమ్స్‌లో చేరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని ఇంకా కిమ్స్ వైద్యులు వెల్లడించలేదు. అయితే ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు కుటుంబ సభ్యులు.