Suresh Babu : ఏపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల థియేటర్స్ కంటే ఓటిటినే సేఫ్ అంటున్న స్టార్ ప్రొడ్యూసర్

స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా ఈ బిల్లుని వ్యతిరేకించారు. అంతే కాక ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల సినిమాలని థియేటర్ లో విడుదల చేయలేమని దానికంటే ఓటిటినే బెటర్.......

Suresh Babu : ఏపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల థియేటర్స్ కంటే ఓటిటినే సేఫ్ అంటున్న స్టార్ ప్రొడ్యూసర్

Suresh Babu

 

Suresh Babu :  ఏపీలో సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలపై కొన్ని రోజులుగా చర్చలు నడిచాయి. సినీ పెద్దలు ఏపీ సీఎం, మంత్రులని కలిసి వారి సమస్యలని వినిపించారు. అయినా సినిమా ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ తన తీరు మార్చలేదు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సినీ పరిశ్రమకి, థియేటర్లకు నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి తప్ప, ఎవరికీ లాభం చేకూర్చేలా లేవు. తాజాగా సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్సట్రా షోలు ఉండవని, టికెట్ రేట్లు భారీగా తగ్గించమని తెలిపారు. ఇది సినీ పరిశ్రమకి భారీ నష్టమే.

Akhanda : బాలకృష్ణలాగా డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో ఎవరూ లేరు: అల్లు అర్జున్

దీనిపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. చాలా వరకు సినీ పెద్దలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. మరో వైపు స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా ఈ బిల్లుని వ్యతిరేకించారు. అంతే కాక ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల సినిమాలని థియేటర్ లో విడుదల చేయలేమని దానికంటే ఓటిటినే బెటర్ అని వ్యాఖ్యలు చేశారు.

Akhanda: జగన్, కేసీఆర్‌కు.. బాలకృష్ణ స్పెషల్ రిక్వెస్ట్..!

నిర్మాత సురేష్ బాబు ‘దృశ్యం’ సినిమాని ఓటిటిలో రిలీజ్ చేశారు. ఈ విషయంపై సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. సురేష్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం విడుదలవుతున్న చాలా సినిమాలకు సరైన వసూళ్లు రావట్లేదు. థియేటర్స్‌ నిండటమే కష్టమవుతోంది. ప్రేక్షకులు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌కు బాగా అలవాటుపడిపోయారు అని అన్నారు.

Bigg Boss 5: నన్ను వదిలేస్తున్నావా.. సిరికి బాయ్ ఫ్రెండ్ సూటి ప్రశ్న!

ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి చక్కటి స్పందన లభిస్తుంది. ‘దృశ్యం-2’ లాంటి కథాబలమున్న సినిమాల్ని థియేటర్స్‌లో విడుదలచేస్తే ప్రశంసలొస్తాయి కానీ వసూళ్లు వచ్చే అవకాశం తక్కువ. ఓటీటీ అయితేనే సేఫ్‌ అనిపించింది. ఏపీలో ఉన్న టికెట్‌ రేట్ల సమస్య కూడా మేము ఓటీటీని ఎంచుకోవడానికి ముఖ్య కారణం. చిత్ర పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం, సమాచార లోపం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాము సృష్టించిన ఓ ప్రొడక్ట్‌ను ఏ రేటుకు అమ్మితే లాభసాటిగా ఉంటుందో నిర్ణయించే హక్కు తమకుందని నిర్మాతలు అనుకుంటున్నారు. టికెట్ రేట్స్ ని బాగా తగ్గించడం, బెనిఫిట్ షోలు, ఎక్సట్రా షోలు రద్దు చేయడం సినీ పరిశ్రమకి, థియేటర్ యాజమాన్యాలకు భారీ నష్టాన్ని మిగులుస్తుంది అని అన్నారు. అందుకే చాలా మంది నిర్మాతలు తమ సినిమాని ఓటిటికి ఇవ్వాలని భావిస్తున్నారు అని తెలిపారు.