Sitara Ghattamaneni Shares Cute Photos with her Pet Dog
Sitara Ghattamaneni : మహేష్ బాబు(Mahesh Babu) కూతురిగా సితార అందరికి తెలిసినా గత కొంతకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడూ ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. చిన్న ఏజ్ లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇటీవల ఓ యాడ్ కూడా చేసి మెప్పించింది.
తండ్రి బాటలోనే కొన్ని మంచి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది సితార. చదువుతో పాటు మరో పక్క మన కల్చరల్ కి సంబంధించినవి అన్ని నేర్చుకుంటూ ప్రతి పండక్కి పద్దతిగా తెలుగింటి కుందనపు బొమ్మలా రెడీ అయి ఫోటోలు కూడా షేర్ చేస్తుంది. అప్పుడప్పుడు సరదా ఫొటోలు కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సితార పాప.
Also Read : Varun Lavanya : హనీమూన్‌లో వరుణ్ లావణ్య క్రిస్మస్ సెలబ్రేషన్స్..
తాజాగా సితార పాప షేర్ చేసిన ఫొటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. నిన్న ఆదివారం కావడంతో లేజీ సండేస్ అంటూ తన పెంపుడు కుక్కతో బెడ్ పై సరదాగా ఆడుకుంటూ దిగిన ఫోటోలని షేర్ చేసింది సితార. వీటికి వెరీ క్యూట్ ఫోటోలంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫొటోలు కూడా షేర్ చేసింది సితార.