టాలీవుడ్లో యంగ్ హీరోలు హల్ చల్ చేస్తున్నారు. వైవిధ్యభరితమైన చిత్రాలు ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. కొత్త కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తూ అగ్ర హీరోలకు పోటీనిస్తున్నారు. యంగ్ హీరోల్లో ‘శర్వానంద్’ ఒకరు. మార్చి 06వ తేదీన ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు సామాజిక వేదిక ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. బర్త్ డే సందర్భంగా శర్వానంద్ కొత్త చిత్రానికి సంబంధించిన ఓ లుక్ బయటకొచ్చింది.
సుధీర్ వర్మ డైరెక్షన్లో శర్వానంద్ నటిస్తున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతోంది. ‘పడి పడి లేచే మనస్సు’ తరువాత శర్వానంద్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. శర్వా బర్త్ డే సందర్భంగా మార్చి 06వ తేదీ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ ఓ లుక్ విడుదల చేసింది. శుభాకాంక్షలు తెలియచేసింది. ఇందులో శర్వా డిఫరెంట్‌గా కనిపించడం అభిమానులను అలరించింది. గ్రే హెయిర్ లుక్, స్టైలిష్‌గా కనిపించాడు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. మేలో సినిమాను రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఫిల్మ్‌కి ‘నందూ భాయ్’ అనే టైటిల్ అనుకుంటున్నారంట. మాఫియా డాన్ పాత్రలో శర్వా నటిస్తున్నట్లు టాక్. తాజాగా విడుదల చేసిన లుక్ కూడా అలాగే ఉంది. చివరి దశలో షూటింగ్ ఉంది.