Amaravathiki Aahwanam : ‘అమరావతికి ఆహ్వానం’.. టైటిల్ సాఫ్ట్.. కానీ సినిమా థ్రిల్లర్..

టైటిల్ ఏమో సాఫ్ట్ గా ఉన్నా సినిమా మాత్రం థ్రిల్లర్ సినిమానే.

Siva Kantamneni Ester Noranha Dhanya Balakrishna Supritha Amaravathiki Aahwanam Movie Announced

Amaravathiki Aahwanam : ఇటీవల థ్రిల్లర్, హారర్ సినిమాలు ఎక్కువగా వచ్చి మెప్పిస్తున్నాయి. ఇప్పుడు ‘అమరావతికి ఆహ్వానం’ అనే మరో హారర్ థ్రిల్లర్ సినిమా రాబోతుంది. టైటిల్ ఏమో సాఫ్ట్ గా ఉన్నా సినిమా మాత్రం థ్రిల్లర్ సినిమానే. శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య‌బాల‌కృష్ణ‌, సుప్రిత, హ‌రీష్.. మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Nithiin Remuneration : వామ్మో.. రాబిన్ హుడ్ సినిమాకు నితిన్ అంత తీసుకున్నాడా? కలెక్షన్స్ మాత్రం..

లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు నిర్మాణంలో రైట‌ర్‌, డెరెక్ట‌ర్ జివికె ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిన్న ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ని చూస్తే.. లీడ్ యాక్ట‌ర్స్ అంతా బ్లాక్ డ్రెస్ వేసుకుని సీరియ‌స్‌ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఫేస్ లు పూర్తిగా రివీల్ కాన‌ప్ప‌టికీ అంద‌రి క‌ళ్ల‌లో ఒకేర‌క‌మైన ఇంటెన్సిటీ ఉంది. హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమా అని పోస్టర్ లోనే హింట్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ అమరావతికి ఆహ్వానం పోస్టర్ వైరల్ గా మారింది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే పూర్తిచేసి రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. సురేఖావాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇప్పటికే హీరోయిన్ గా ఒక సినిమా చేస్తుంది. ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఇప్పుడు ఈ సినిమాలో కూడా మెయిన్ లీడ్ ఛాన్స్ తెచ్చుకోవడం గమనార్హం.