Nithiin Remuneration : వామ్మో.. రాబిన్ హుడ్ సినిమాకు నితిన్ అంత తీసుకున్నాడా? కలెక్షన్స్ మాత్రం..
నితిన్ ఇటీవల రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Hero Nithiin Remuneration for Robinhood Movie
Nithiin Remuneration : నితిన్ ఇటీవల రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నితిన్, శ్రీలీల జంటగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కేతిక శర్మ అదిరిపోయే ఐటెం సాంగ్ చేసింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఓ పాత్ర పోషించాడు. దీంతో సినిమా రిలీజ్ ముందు భారీ అంచనాలు వచ్చాయి.
సినిమా కామెడీ ఎంటర్టైనర్, కమర్షియల్ గా తెరెకెక్కించారు. ఈ సినిమా మార్చ్ 28 రిలీజయి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు ఇప్పటివరకు కేవలం 15 కోట్లపైన గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 50 కోట్లు గ్రాస్ వసూలు చేయాలి. ఇక ఈ సినిమాకు భారీగానే బడ్జెట్ పెట్టారు.
Also See : Janhvi Kapoor : ఉఫ్.. సమ్మర్ లో మరింత హీట్ ఎక్కిస్తున్న జాన్వీ కపూర్.. ఫ్యాషన్ షో కోసం..
రాబిన్ హుడ్ సినిమాకు దాదాపు 50 కోట్ల బడ్జెట్ అనుకుంటే అది ఇంకా పెరిగి 70 కోట్ల వరకు అయిందని తెలుస్తుంది. ఇందులో నితిన్ రెమ్యునరేషన్ కే 15 కోట్లు అయిందని టాలీవుడ్ లో వినిపిస్తుంది. దీంతో నితిన్ అంత తీసుకుంటున్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. గత కొంతకాలంగా నితిన్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. అయినా 15 కోట్లు తీసుకున్నాడు అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక డేవిడ్ వార్నర్ కి రెండున్నర కోట్లు ఇచ్చారట.
నిర్మాతలకు హీరోల రెమ్యునరేషన్స్ తడిసి మోపెడు అవుతున్నాయి. పోనీ వాళ్లకు అంత మార్కెట్ ఉండి, సినిమాలు అంత కలెక్ట్ చేస్తున్నాయా అంటే అది లేదు. అయినా హీరోల రెమ్యునరేషన్స్ పెంచేస్తున్నారు. రెమ్యునరేషన్స్ చర్చ ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో నడుస్తుంది. అయినా ఎవరు తగ్గించట్లేదు, నిర్మాతలు తగ్గించమని అడుగుతున్నారో లేదో. రాబిన్ హుడ్ సినిమా థియేట్రికల్ గా బ్రేక్ ఈవెన్ చేయడం కష్టమే అని తెలుస్తుంది.
ఇక నితిన్ చేతిలో రాబిన్ హుడ్ తర్వాత తమ్ముడు, ఎల్లమ్మ, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాలు ఉన్నాయి.