Vaishnavi Chaitanya : ‘బేబీ’ హీరోయిన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? తెలుగు హీరోయిన్స్ లోనే టాప్.. చేతిలో బోలెడు సినిమాలు..
వైష్ణవి చైతన్యకు వరుస ఆఫర్స్ వస్తూనే భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట.

Telugu Actress Baby Fame Vaishnavi Chaitanya Shocking Remuneration going Viral
Vaishnavi Chaitanya : బేబీ సినిమాలో అమాయకంగా, బోల్డ్ గా రెండు వేరియేషన్స్ లో నటించి ఒక్కసారిగా స్టార్ అయిపోయింది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. కానీ బేబీ ముందే అనేక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పాపులర్ అయింది. యూట్యూబ్ లో ది సాఫ్ట్‌వేర్ డెవలపర్, మిస్సమ్మ.. లాంటి పలు సిరీస్ లతో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అలవైకుంఠపురం, వరుడు కావలెను.. ఇలా పలు తెలుగు, తమిళ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.
హీరోయిన్ గా మొదటి సినిమా బేబీతోనే తన నటన, అందంతో ఆకట్టుకుంది. బేబీ పెద్ద హిట్ అవ్వడంతో హీరోయిన్ గా సెటిలయింది ఈ తెలుగమ్మాయి. బేబీ తర్వాత ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ అనే సినిమాతో వచ్చింది. త్వరలో సిద్ధూ జొన్నలగడ్డ సరసన జాక్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండతో సితార బ్యానర్ లో ఒక సినిమా చేస్తుంది. ప్రస్తుతం గత రెండు రోజుల నుంచి వైష్ణవి పేరు వైరల్ అవుతుంది.
Also Read : Mowgli : విలన్ గా మారిన మరో హీరో.. యాంకర్ సుమ కొడుకు సినిమాలో..
వైష్ణవి చైతన్యకు వరుస ఆఫర్స్ వస్తూనే భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. వైష్ణవి తెలుగులో మరో రెండు సినిమాలు, తమిళ్ లో రెండు సినిమాలు ఓకే చేసిందని సమాచారం. ఇందులో ఓ సినిమాకు వైష్ణవి చైతన్యకు కోటి రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. వైష్ణవి క్రేజ్ ని సరిగ్గా క్యాష్ చేసుకోవాలని ఆ నిర్మాత, మూవీ యూనిట్ ప్లాన్ లో ఉన్నారు.
దీంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఉన్న తెలుగు హీరోయిన్స్ లో కోటి రూపాయలు ఏ హీరోయిన్ కి ఇవ్వట్లేదు. అలాంటిది వైష్ణవికి ఇచ్చారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకో రెండు సినిమాలు రిలీజ్ అయి హిట్ కొడితే వైష్ణవి కూడా స్టార్ కమర్షియల్ హీరోనే అవ్వడం గ్యారెంటీ అంటున్నారు. ఇక వైష్ణవి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. తెలుగమ్మాయి కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొని వరుస సినిమాలతో బిజీ అవుతుందంటే గ్రేట్ అని చెప్పొచ్చు.