Ayalaan : ఏలియన్ తో పాన్ ఇండియా సినిమా ప్రకటించిన శివకార్తికేయన్.. దీపావళికే థియేటర్స్ లో
ఇటీవలే శివకార్తికేయన్ తన నెక్స్ట్ సినిమా మహా వీరుడు సినిమా ఆగస్టు 11న రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. తాజాగా ఆ తర్వాతి సినిమా కూడా దీపావళికి రాబోతుందని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Siva Krthikeyan Ayalaan movie Releasing on Diwali
Ayalaan : తమిళ్(Tamil) స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) కు తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇటీవల శివకార్తికేయన్ సినిమాలన్నీ తెలుగులో రిలీజయి ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. గత సంవత్సరం అనుదీప్(Anudeep) దర్శకత్వంలో ప్రిన్స్(Prince) సినిమాతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ కూడా ఇచ్చాడు శివ కార్తికేయన్.
ఇటీవలే శివకార్తికేయన్ తన నెక్స్ట్ సినిమా మహా వీరుడు సినిమా ఆగస్టు 11న రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. తాజాగా ఆ తర్వాతి సినిమా కూడా దీపావళికి రాబోతుందని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సారి సరికొత్త కథతో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు.
శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అయలాన్’. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. తమిళ్ లో ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. ఒక ఏలియన్ క్యారెక్టర్ తో శివ కార్తికేయన్ సినిమా చేయబోతున్నారు. సైన్స్ ఫిక్షన్, కామెడీ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. సౌత్ ఇండియాలో ఇటువంటి ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో సినిమా రావడం ఇదే మొదటిసారి.
PS 2 Pre Release Event : పొన్నియిన్ సెల్వన్ హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
దీపావళి కానుకగా ‘అయలాన్’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత కోటపాడి జె. రాజేష్ తెలిపారు. ‘అయలాన్’లో 4500లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని, ఇండియన్ సినిమా హిస్టరీలో ఇన్ని VFX షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ సినిమా ఇదేనని చిత్ర బృందం తెలియజేసింది. రకుల్ తో పాటు ఈ సినిమాలో ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగిబాబు, శరద్ కేల్కర్.. ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో వస్తున్న శివ కార్తికేయన్ ఈ సినిమాతో ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి మరి.
Let’s fly high this diwali! ?#AyalaanFromDiwali2023 ??#Ayalaan@Ravikumar_Dir @arrahman @kjr_studios @24amstudios @Phantomfxstudio @Rakulpreet @ishakonnects @SharadK7 @iYogiBabu #Karunakaran #Niravshah @AntonyLRuben @muthurajthangvl @anbariv @SOUNDARBAIRAVI… pic.twitter.com/1EwMe02EUR
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 24, 2023