Sivaji : పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై మొదటిసారి మాట్లాడిన శివాజీ.. ఏమన్నాడంటే..?

తాజాగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తర్వాత మొదటిసారి శివాజీ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

Sivaji First Reaction on Bigg Boss Season 7 Pallavi Prashanth Arrest

Sivaji : ఇటీవల బిగ్‌బాస్(Bigg Boss) సీజన్ 7 విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చాక పోలీసులు చెప్పినా వినకుండా వాళ్లతో రూడ్ గా బిహేవ్ చేసి ఊరేగింపు చేసుకుంటూ వెళ్లడం, దీంతో ప్రశాంత్ అభిమానులు రెచ్చిపోయి రోడ్డు మీద జనాలను, వాహనాలను ఇబ్బంది పెట్టడం, ఈ ఘటనలో పలు ప్రైవేట్, గవర్నమెంట్ వాహనలు దెబ్బ తినడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనలో పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడు, మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ కి 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుంది. ప్రశాంత్ అరెస్ట్ పై పలువురు అభిమానులు, నెటిజన్లు, బిగ్‌బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ ఒక గ్రూప్ గా ఉండి ఆడిన సంగతి తెలిసిందే.

Also Read : Salaar Part 2 : సలార్ పార్ట్ 2 టైటిల్ ఏంటో తెలుసా? పార్ట్ 2 స్టోరీ ఇదే..

తాజాగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తర్వాత మొదటిసారి శివాజీ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. చాలా మంది నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతున్నారు. ప్రశాంత్ ఎలాంటివాడో అందరికి తెలుసు. చాలా మంచివాడు. కాకపోతే చిన్న వయసులో గెలిచాను అనే ఆనందంలో అందర్నీ కలవాలి అనే ఓ సంతోషంతో అతను అలా వెళ్ళాడు. ప్రశాంత్ గురించి నేను పదేపదే మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ ఇష్యూ మొదలైనప్పటి నుంచి అన్ని అప్డేట్స్ నాకు వస్తున్నాయి. ప్రశాంత్ చట్టాన్ని గౌరవిస్తాడు. చట్ట పరంగానే బయటకి త్వరలో వస్తాడు. అతను ఏ తప్పు చేయలేదు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. దీంతో శివాజీ వీడియో వైరల్ గా మారింది.