Sivaji Raja
Sivaji Raja : అమృతం సీరియల్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. 90s కిడ్స్ కి ఆ సీరియల్ చాలా స్పెషల్. ఒక జనరేషన్ మొత్తాన్ని అమృతం సీరియల్ నవ్వించింది. అయితే ఆ సీరియల్ లో టైటిల్ లీడ్ లో శివాజీ రాజా మొదట నటించగా తర్వాత నరేష్, హర్షవర్ధన్ నటించారు.(Sivaji Raja)
అసలు అమృతం సీరియల్ మొదలైంది శివాజీ రాజాతోనే. కానీ శివాజీ రాజా ఆ సీరియల్ నుంచి తప్పుకున్నాడు. అమృతం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత యూట్యూబ్ లో అమృతం సీరియల్ ని రీ టెలికాస్ట్ చేస్తున్నారు. తాజాగా శివాజీ రాజా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమృతం సీరియల్ గురించి మాట్లాడారు.
Also Read : Sivaji Raja : నా క్లోజ్ ఫ్రెండ్.. దాని వల్లే దూరమయ్యాం.. నాగబాబుతో విబేధాలపై స్పందించిన నటుడు..
శివాజీ రాజా మాట్లాడుతూ.. అమృతం వల్ల సినిమా కలెక్షన్స్ కి ఎఫెక్ట్ అయింది. ఒక పెద్ద నిర్మాత నేను ‘మా’ వైస్ ప్రసిడెంట్ గా ఉన్నప్పుడు నాతో ఓ మాట అన్నాడు. అమృతం సీరియల్ రాత్రి 8.30కి వస్తుంది. ఆ సమయంలో సెకండ్ షో, ఫస్ట్ షోలు వేస్తాం. దాని వల్ల సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది. జనాలు థియేటర్స్ కి రావట్లేదు. టీవీ వాళ్ళతో మాట్లాడి ఆ టైం మార్పించు అని అడిగారు. అప్పుడే ఆ సీరియల్ సక్సెస్ అయింది.
అసలు అది రీ టెలీకాస్ట్ అవుతుందని నాకు తెలీదు. ఆ సీరియల్ నుంచి తప్పుకోవడం అనుకోకుండా జరిగింది. అందరి మధ్య గొడవలు వస్తాయి. అలాగే నిర్మాత ఆర్టిస్ట్ మధ్య వస్తాయి. అందుకే ఆ సీరియల్ నుంచి వెళ్ళిపోయాను. ఇవాళ్టికి చెప్తాను నా తప్పు లేదు ఆ విషయంలో. ఆ టీమ్ అంతా చాలా ట్యాలెంటెడ్ పీపుల్, వాళ్ళు మంచోళ్ళు అని అన్నారు.