Actress Hema : పార్టీలోకి రమ్మని జగనన్న పిలిచాడు.. త్వరలోనే పవన్ కళ్యాణ్ ని కలుస్తాను.. చచ్చేలోపు నా టార్గెట్ అదే..
తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ రాజకీయాల గురించి మాట్లాడింది. (Actress Hema)
Actress Hema
Actress Hema : సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. లేడీ కమెడియన్ గా కూడా ఎన్నో సినిమాలతో నవ్వించింది. హేమ గత కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించింది. అంతే కాకుండా ఇటీవల డ్రగ్స్ ఆరోపణల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఆ కేసులో ఇటీవలే క్లీన్ చిట్ వచ్చింది హేమకు.(Actress Hema)
హేమ గతంలో రాజకీయాల్లో కూడా ఉంది. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. వైఎస్సార్సీపీ పార్టీలో జాయిన్ అయిందని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు రాజకీయాలకు కూడా దూరంగా ఉంది. తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ రాజకీయాల గురించి మాట్లాడింది.
Also Read : Sivaji Raja : నా క్లోజ్ ఫ్రెండ్.. దాని వల్లే దూరమయ్యాం.. నాగబాబుతో విబేధాలపై స్పందించిన నటుడు..
హేమ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేశాను. జై సమైక్యాంధ్ర లో ఉన్నాను. అప్పుడే పుట్టిన పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేశాను. నేను పుట్టిన రాజోలు రిజర్వ్ నియోజకవర్గం అవ్వడంతో మండపేటలో పోటీ చేశాను. నాకు 4 వేల ఓట్లు పడ్డాయి. తర్వాత జగనన్న పిలిచాడు 2019లో. కానీ నాకు కుదరలేదు. తర్వాత జగనన్న ఇంకో మీటింగ్ కి కూడా పిలిచారు. కానీ కుదరక వెళ్ళలేదు. నేను ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. నా మైండ్ సెట్ మారిపోయింది ఇప్పుడు. ఏ పార్టీలోకి వెళ్ళాలి అనుకోలేదు ఇంకా.
పవన్ కళ్యాణ్ గారిని తొందరగానే కలుస్తాను. ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కోసం కలవాలి. ఒక ఈవెంట్ చేయాలి. దానికి సపోర్ట్ కోసం పవన్ కళ్యాణ్ గారిని కలవాలి. రాజకీయంగా నేను ఆయనతో పనిచేస్తానో లేదో తెలీదు. రాజకీయాల గురించి కంటే కూడా నా మీద జరిగిన దాడి గురించి, మా అసోసియేషన్ గురించి మాట్లాడాలి ఆయనతో. రాజకీయాల్లో ఆయన పై, ఆయన ఫ్యామిలీల గురించి కూడా మాట్లాడారు. అప్పుడు ఆయనకు ‘మా’ సపోర్టు చేయలేదు. అందుకే మా అసోసియేషన్ కి ఒక పవర్ కావాలి.
Also Read : Actress Hema : నేనేమైనా టెర్రరిస్ట్ నా.. మీడియా వల్లే అరెస్ట్ అయ్యాను.. నా కూతురు చాలా సఫర్ అయింది..
దాసరి నారాయణ గారు తర్వాత ఇండస్ట్రీ పెద్ద పవన్ కళ్యాణ్ గారే అని నేను చూస్తాను. ‘మా’కు ఒక శక్తి రావాలంటే పవన్ కళ్యాణ్ గారే. నేను రాజకీయాలకు వెళ్తాను భవిష్యత్తులో. ప్రస్తుతం నా కోసం నేను బతుకుతున్నాను. కొన్నాళ్ళు అయ్యాక వెళ్తాను. నాకు వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం. నా లైఫ్ లో ఎప్పటికైనా టీటీడీ బోర్డు మెంబర్ అవ్వాలని నా టార్గెట్. చచ్చేలోపు అది అవ్వాలి. టీటీడీ బోర్డు మెంబర్ అయి స్వామి వారికి సేవ చేసుకోవాలి అని తెలిపింది. మరి హేమ భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతుందో చూడాలి.
