Actress Hema : నేనేమైనా టెర్రరిస్ట్ నా.. మీడియా వల్లే అరెస్ట్ అయ్యాను.. నా కూతురు చాలా సఫర్ అయింది..
ఆ సంఘటన తర్వాత, కేసు కొట్టేసిన తర్వాత హేమ మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది. (Actress Hema)
Actress Hema
Actress Hema : సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కొన్నాళ్ల క్రితం బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొంది, డ్రగ్స్ తీసుకుంది అనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ అరెస్ట్ అయి జైలుకి వెళ్లి వచ్చింది. హేమ నేనేం తప్పు చేయలేదు అని మొదట్నుంచి చెప్తుంది. ఇటీవలే కోర్టు హేమ నిర్దోషి అని తీర్పు ఇచ్చి ఆ కేసుని కొట్టేసింది.(Actress Hema)
ఆ సంఘటన తర్వాత, కేసు కొట్టేసిన తర్వాత హేమ మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది. 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ మీడియా వల్లే ఇదంతా జరిగింది అంటూ ఫైర్ అయింది.
హేమ మాట్లాడుతూ.. నేనేమైనా టెర్రరిస్ట్ నా రెడ్ హ్యాండిడ్ గా పట్టుకోడానికి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హేమ అంటూ బ్రేకింగ్స్ మీద బ్రేకింగ్స్ వేశారు. నేను కాదు అని చెప్పినా నేనే అని ప్రచారం చేసారు. నేను పార్టీ కి వెళ్లి వచ్చేసాను అది నేను కాదు అని చెప్పినా వినలేదు. అరెస్ట్ చేస్తారని కూడా తెలీదు. నేను బ్లడ్ టెస్ట్ చేసినా నెగిటివ్ వచ్చింది. అయినా పోలీసులు మళ్ళీ చేస్తామని అన్నారు. మీడియా వల్లే నేను అరెస్ట్ అయ్యాను. మళ్ళీ మళ్ళీ టెస్టులో ఏం లేదని చెప్పినా చెక్ చేయించిన పోలీసులను ప్రశ్నించకుండా నన్ను ఎందుకు టార్గెట్ చేసారు? నేను వాదించినా, నేను చెప్పినా ఛానల్స్ కూడా వినలేదు.
ఆ ఇష్యూలో ఉన్నప్పుడు నాకు ఐదారొందల కాల్స్ అవచ్చాయి. అప్పుడు మీడియా వాళ్ళు మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి మాకు ఇవ్వండి అడిగారు. ఇప్పుడు అసలు ఏం లేదు, జడ్జిమెంట్ వచ్చింది అన్నా, నేను వివరణ ఇస్తా అన్నా ఇంటర్వ్యూ తీసుకోవట్లేదు. అప్పుడు అంత హడావిడి చేసారు. ఇప్పుడు ఎందుకు చెయ్యట్లేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు చాలా మంది భయపడ్డారు. నేను ఒక పార్టీకి వెళ్తే చుట్టూ ఉన్న ఆడోల్లు తొందరగా వెళ్ళిపోతే బెటర్ అనుకునేవాళ్లు. నన్ను ఎవరూ పార్టీకి పిలవలేదు. పిలిస్తే మళ్ళీ ఏం రిస్క్ వస్తుందో అని భయపడ్డారు. రీసెంట్ గా ఒక బర్త్ డే పార్టీకి వెళ్లి వచ్చేసాను. నేను వచ్చేసాక పోలీసులు వెళ్లారు అక్కడికి. నా కోసమే వచ్చారని పబ్లిసిటీ చేసారు. హేమ ఉంటే పోలీసులు వస్తారని చెప్పామా అని మాట్లాడారు.ఇలాంటివి చాలా సఫర్ అయ్యాను. నా కూతురు అప్పుడే జాబ్ ట్రైలర్ లో ఉంది. తన జాబ్ కి చాలా ఇబ్బంది కలిగింది. నా కూతురు చాలా ఎఫెక్ట్ అయింది అని తెలిపింది.
Also Read : Actress Hema: నాపై ఆ ట్రోలింగ్.. అమ్మను బలి తీసుకుంది..! తల్లి మరణం గురించి నటి హేమ ఎమోషనల్..
