Sivaji Raja
Sivaji Raja : సీనియర్ నటుడు శివాజీ రాజా, మెగా బ్రదర్ నాగబాబు ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్. కానీ కొన్నేళ్ల క్రితం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసారు. మీడియా ముందే ఇద్దరూ ఫైర్ అయ్యారు. పొలిటికల్ పరంగా కూడా విమర్శలు చేశారు. క్లోజ్ గా ఉండే నాగబాబు శివాజీ రాజా ఎందుకు విడిపోయారు అని అంతా అనుకున్నారు.(Sivaji Raja)
తాజాగా శివాజీ రాజా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి పూర్తిగా స్పందించకపోయినా, అసలు గొడవలకు కారణం ఏంటి అని పూర్తిగా చెప్పకపోయినా ఈ గొడవలకు ముగింపు ఇస్తాను అని తెలిపారు.
శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్లే నాగబాబు నేను దూరమయ్యాం. ఎంత కష్టపడినా ఎంత జెన్యూన్ గా ఉన్నా చిన్న ఇష్యూ వస్తే మొత్తం పోతుంది. నేనేంటో అందరికి తెలుసు. ఇక్కడ అందరూ బతకాలి. మా లో జరిగిన కొన్ని సంఘటనల వల్లే మేము విడిపోయాము. నాగబాబు నాకు చాలా క్లోజ్. ఆయనతో వాళ్ళింటికి వెళ్ళేవాడిని. నాగబాబు నాకు క్లోజ్ ఫ్రెండ్. నా బ్రదర్ కంటే ఎక్కువ.
అంతకంటే ఎక్కువగా దీని గురించి మాట్లాడలేను. అది మాట్లాడితే నాకు గుండెల్లో గెలికేసినట్టు ఉంటుంది. త్వరలో వెళ్లి నాగబాబుని కలిసి హగ్ ఇచ్చి వస్తాను. నన్ను తిట్టినా ఏమన్నా పర్లేదు నేను వెళ్లి హగ్ చేసుకుంటా. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తా అని అన్నారు. ఈ ఇద్దరూ కలవాలని టాలీవుడ్ లో చాలా మంది కోరుకుంటారు. మరి ఎప్పుడు కలుస్తారో చూడాలి.
Also Read : Actress Hema : నేనేమైనా టెర్రరిస్ట్ నా.. మీడియా వల్లే అరెస్ట్ అయ్యాను.. నా కూతురు చాలా సఫర్ అయింది..