SJ Suryah Intersting Comments on Pawan Kalyan and Akira Nandan in Game Changer Promotions
SJ Suryah : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. నిన్నే రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించగా పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించిన స్టార్ యాక్టర్, డైరెక్టర్ SJ సూర్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ బోలెడన్ని విషయాలు పంచుకున్నారు.
Also See : కల్కి సినిమా నుంచి దీపికా పదుకోన్ మేకింగ్ వీడియో రిలీజ్.. దీపిక బర్త్ డే స్పెషల్..
నిన్న ప్రీ రిలీ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ SJ సూర్య గురించి గొప్పగా చెప్పి పిలిచి మరీ హగ్ ఇచ్చారు. దీనిపై SJ సూర్య స్పందిస్తూ.. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈవెంట్‌కు రావడం, వచ్చి నా గురించి అలా మాట్లాడుతూ ఉంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అసలు నోట మాట రాలేదు. ఆయన్ను హత్తుకున్నప్పుడు తెలియని ఆనందం కలిగింది. ఖుషీ టైంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా పవన్ అలానే ఉన్నారు. అప్పుడే ఆయన ఐడియాలజీ చెప్పేవారు కానీ నాకు అర్దమయ్యేవి కావు. ఇప్పటికి అదే ఐడియాలజీతో ప్రజల కోసం పనిచేస్తున్నారు. నిజాయితీగా కష్టపడే వారిని ఆయన ఎప్పుడూ ప్రేమిస్తారు అని అన్నారు.
ఖుషి 2, పవన్ తనయుడు అకిరా నందన్ ప్రస్తావన రాగా.. ప్రస్తుతం నేను నటుడిగా కంఫర్ట్ గా ఉన్నాను. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఆలోచించట్లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. మొదట గుర్తుపట్టలేదు. చాలా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ గారిలాగే పుస్తకాలు పట్టుకుని చదువుకుంటున్నాడు. ఇక ఖుషి 2 గతంలో పవన్ తో అనుకున్నా కానీ కుదరలేదు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే, టైం కలిసి వస్తే అకిరాతో జరుగుతుందేమో చూడాలి అని అన్నారు SJ సూర్య.
Also Read : Aditi Shankar : డైరెక్టర్ శంకర్ తో కూతురు అదితి శంకర్ పోటీ.. సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ కు పోటీగా..
ఇక గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. గేమ్ చేంజర్ సెట్‌లో శంకర్ గారు చెప్పింది చెప్పినట్టుగా చేశాను. నా పర్ఫామెన్స్ చూసి శంకర్ గారు ఇంప్రెస్ అయి ఇండియన్ 2లో కూడా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే. నాకు, చరణ్ కి మధ్య సీన్స్ బాగా వచ్చాయి. నేను ఇంకా సినిమా మొత్తం చూడలేదు. చూసిన సీన్స్ వరకు అద్భుతంగా ఉన్నాయి. గేమ్ చేంజర్ సెట్‌కు వచ్చే ముందు చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. డబ్బింగ్ కి మాత్రం చాలా కష్టపడ్డాను. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను అని తెలిపారు.
చరణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా వినయంగా ఉంటారు. ఒక రోజు నాకు ట్రీట్ ఇచ్చి ఆయనే ఫుడ్ స్వయంగా వడ్డించారు. ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్‌గా హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్రలో చరణ్ అద్భుతంగా నటించారు అని తెలిపారు. గేమ్ ఛేంజర్ లో జరగనుంది సాంగ్ గురించి మాట్లాడుతూ.. ఈ ఒక్క సాంగ్ కే 25 కోట్లు ఖర్చుపెట్టారని విన్నాను. జరగండి పాట లిరికల్ వీడియో వచ్చినప్పుడు కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి అనుకున్నాను. కానీ పూర్తి పాట చూసి షాక్ అయ్యాను. ఈ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయి. ఓ కాఫీ కప్పులోనే ఊరి సెట్ వేసినట్టుగా సెట్ చాలా గ్రాండ్ గా వేశారు అని తెలిపారు.
దిల్ రాజు గురించి మాట్లాడుతూ.. ఆయన కేవలం డబ్బులు పెట్టి సినిమాలు తీసే నిర్మాత కాదు సెట్ కి వచ్చి అన్ని చూసుకుంటారు. సెట్స్ మీదే సమస్యల్ని పరిష్కరిస్తారు. ఆయనకు కథల మీద మంచి పట్టుంది. ఏదైనా సరే సింపుల్ గా ముక్కుసూటిగా మాట్లాడి సెటిల్ చేస్తారు అని అన్నారు. ఇక ఇప్పటికే నటుడిగా SJ సూర్య అందరి ప్రశంసలు సంపాదించాడు. ఇటీవల సరిపోదా శనివారం అయితే నానినే డామినేట్ చేసే రేంజ్ లో నటించి మెప్పించారు. మరి గేమ్ ఛేంజర్ లో ఏ రేంజ్ లో అదరగొట్టాడో చూడాలి.