×
Ad

Soggadu : 50 ఏళ్ళ ‘సోగ్గాడు’.. మళ్ళీ వచ్చేస్తున్నాడు..

టాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో సోగ్గాడు కూడా ఒకటిగా మిగిలింది. (Soggadu)

Soggadu

Soggadu : ఒకప్పటి స్టార్ హీరో, దివంగత నటుడు శోభన్ బాబు ‘సోగ్గాడు’ సినిమా 1975 లో భారీ విజయం సాధించింది. టాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో సోగ్గాడు కూడా ఒకటిగా మిగిలింది. ఈ సినిమా రిలీజయి 50 ఏళ్లు పూర్తవడంతో సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అదే రోజు ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేయబోతుంది.(Soggadu)

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై రామానాయుడు నిర్మాణంలో బాపయ్య దర్శకత్వంలో సోగ్గాడు సినిమా తెరకెక్కి 1975 లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ అవుతుంది. రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.

Also Read : Rajasaab : వామ్మో.. రాజాసాబ్ సినిమా లెంగ్త్ ఎంతో తెలుసా.. షూటింగ్ ఫుటేజ్ అయితే మరీ దారుణం..

సోగ్గాడుకు సంబంధించి రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో మురళీమోహన్ మాట్లాడుతూ.. నన్ను సినిమా పరిశ్రమలోకి రమ్మని ఆహ్వానించింది శోభన్ బాబు. శోభన్ బాబుతో నేను ముగ్గురు మిత్రులు అనే సినిమా చేశాను. క్రమశిక్షణకు ఆయన మారుపేరు. మా బ్యానర్ లో తీసిన అతడు సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం ఆయనకు బ్లాంక్ చెక్కు ఇచ్చి నటించమని అడిగినా అందాల నటుడిగా నాకున్న పేరును అలానే కొనసాగించాలంటే హీరోగా తప్ప వేరే పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు నాకు చెప్పారు. శోభన్ బాబు భౌతికంగా దూరమై 17 ఏళ్లు అయ్యింది. అంతకుముందు 13 ఏళ్ళు ఆయన నటించలేదు. ఆయన నటనకు దూరమయి 30 ఏళ్లు గడిచినా శోభన్ బాబును గుర్తుపెట్టుకుని అభిమానులు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని అన్నారు.

నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. 1975లో విడుదలైన సోగ్గాడు సినిమా మా సంస్థకు మంచి పేరు, డబ్బు తెచ్చిపెట్టింది. సౌండ్ కు సంబంధించి నేటి టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నిర్మాతలు, దర్శకులు, శోభన్ బాబు అభిమానులు పాల్గొన్నారు. సోగ్గాడు రీ రిలీజ్ ట్రైలర్ చూసేయండి..

Also Read : Andhra King Taluka OTT: ఓటీటీకి వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?