Sobhita Dhulipala
Sobhita Dhulipala : నటి శోభిత ధూళిపాళ తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ భాషల్లో సినిమాలు, సిరీస్ లు చేసి మెప్పించింది. 2024 డిసెంబర్ లో నాగచైతన్య తో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా శోభిత సోషల్ మీడియాలో, బయట ఈవెంట్స్ లో యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా శోభిత తన కొత్త సినిమాని ప్రకటించింది.(Sobhita Dhulipala)
నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ నుంచి రాబోయే మొదటి సినిమాని నేడు అనౌన్స్ చేసారు. ఈ సినిమా టైటిల్ ‘చీకటిలో’. ఈ సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు తమిళ్, హిందీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
చీకటిలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ శోభిత ధూళిపాళ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో శోభితని చూస్తుంటే రేడియో జాకీ లా కనిపిస్తుంది. శోభిత వెనకాల ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన సెటప్ ఉంది. దీంతో చీకటిలో సినిమా థ్రిల్లర్ జానర్ అని తెలుస్తుంది. మరి చీకటిలో సినిమాతో శోభిత ఎలా మెప్పిస్తుందో చూడాలి.
Also Read : Toxic: Introducing Raya : ‘టాక్సిక్’ గ్లింప్స్ రిలీజ్.. హాలీవుడ్ లెవల్లో అదిరిందిగా.. వైలెన్స్ & రొమాన్స్..