తనతో సనా ఖాన్‌ని పోల్చిన వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హాట్ బ్యూటీ

  • Published By: sekhar ,Published On : November 25, 2020 / 04:37 PM IST
తనతో సనా ఖాన్‌ని పోల్చిన వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హాట్ బ్యూటీ

Updated On : November 25, 2020 / 4:51 PM IST

Sofia Hayat: సోఫియా హయత్ తనను సనా ఖాన్‌తో పోల్చిన వాళ్లు ఫూల్స్ అంటూ కామెంట్స్ చేసింది. అసలేం జరిగింది అంటే.. హీరోయిన్‌ సనా ఖాన్‌ ఇటీవల గుజరాత్‌కు చెందిన ముఫ్తి అనాస్‌ను పెళ్లి చేసుకుంది.

అయితే అంతకుముందు సినిమాలను వదిలేసి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నానని తెలిపిన సనా ఖాన్‌.. సడెన్‌గా ఇలా తన నిర్ణయం మార్చుకుని వివాహం చేసుకోవడంతో అంతా షాకవ్వడమే కాకుండా.. తనని హాట్‌ బాంబ్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న సోఫియా హయత్‌తో పోల్చుతూ రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.వాస్తవానికి సోఫియా కూడా తనకొస్తున్న అవకాశాలను వదిలేసి నన్‌గా మారింది. అయితే సనా ఖాన్‌ని ఉద్దేశించి.. తనతో పోల్చుతున్న వారిని.. ఆమె చీప్‌ పీపుల్‌ అంటూ వ్యాఖ్యానించింది.


ఈ సందర్భంగా సోఫియా హయత్ మాట్లాడుతూ.. ‘‘నాతో సనా ఖాన్‌ను పోల్చుతూ కామెంట్స్‌ చేస్తుంటే చిరాకొస్తుంది. వేసుకునే బట్టలను బట్టి ఆధ్యాత్మికత వస్తుందని కొందరు అనుకుంటున్నారు.


నేను నన్‌గా ఉన్నప్పుడు 18 నెలల పాటు సెక్స్‌కి దూరంగా ఉన్నాను. ఇప్పుడు ప్రతి రోజూ నేను నన్‌ దుస్తులు వేసుకోకపోవచ్చు.. అంత మాత్రాన నాలో ఆధ్యాత్మికత తక్కువైపోదు.

మొత్తం బట్టలు కట్టుకుని పొందే ఆధ్యాత్మికత కంటే నగ్నత్వంలోనే ఎక్కువ ఆధ్యాత్మికతను పొందుతాను నేను. మైండ్‌ లేని వారు ఇది అర్థం చేసుకోలేరు. నేను మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి సెక్స్‌ రిలేషన్స్‌లో పాల్గొనలేదు.



ఇప్పటికీ మదర్‌ సోఫియాగా, ఆధ్యాత్మికతలోనే ఉన్నాను. సనాని ఒంటరిగా వదిలేయండి. ఆమె కోరుకున్నప్పుడు కోరుకున్న విధంగా ఉండగలదు. మీకు ఇతరులను జడ్జ్‌ చేసే శక్తి ఉందని భావిస్తే.. నా అడుగుజాడల్లో ఒక్కరోజు నడిచి చూడండి.. మీరు తప్పకుండా ఏదో ఒకటి నేర్చుకుంటారు’’ అని చెప్పుకొచ్చింది సోఫియా హయత్.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)