బిగ్‌బాస్ షోలో ఫైనల్ ఎపిసోడ్‌లో సోహెల్ 25 లక్షలు తీసుకుని ఆట నుంచి తప్పుకున్న తర్వాత.. ఓ వీడియో నెట్టింట్లె ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. మెహబూబ్ సోహెల్ కలిసి చేసి స్కాం చేసి.. బిగ్ బాస్ ఫినాలేలో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేశాడు అనేది ఆ వీడియో సారాంశం.. సోహెల్‌కు ముందే మెహబూబ్ హింట్ ఇచ్చాడని, అందుకే సోహెల్ పాతిక లక్షలు తీసుకుని వచ్చేశాడు అనేది బయట వినిపిస్తున్న విమర్శ.
ఈ విమర్శలు చూసిన తర్వాత.. బయటకు ఎందుకొచ్చాం రా.. మళ్లీ బిగ్‌బాస్‌లోకి వెళ్లిపోదాం అనిపించింది అంటూ టెన్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు సోహెల్. మెహబూబ్ చేతులతో సైగలు చేయడం, అభిజిత్ ఫస్ట్ ప్లేస్ అని చెప్పడంతోనే సోహెల్ వచ్చాడంటూ వస్తున్న వైరల్ వార్తలపై బాధపడిపోయారు. 10టీవీ స్టూడియోలో లైవ్‌లోనే వెక్కివెక్కి ఏడ్చేశారు.
ఈ సంధర్భంగా లైవ్‌లో ఫోన్‌కాల్ ద్వారా వచ్చిన మెహబూబ్.. కూడా ప్లేస్ గురించి హింట్ ఇచ్చినట్లుగా వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రమ్ ఫాలోవర్స్ గురించి వేళ్లు చూపించానే తప్పితే.. మరో విషయం కాదని అన్నారు. అంతేకాదు.. నా కెరీర్ మీద ఒట్టు.. నేను తప్పు చేయలేదు.. అంటూ సోహెల్ అన్నారు. ప్రేమ, అభిమానాలు పంచిన ప్రజలకు నేను ఇవ్వగలిగింది ఒక్కటే.. ఎంటర్‌టైన్‌మెంట్ అని అన్నారు సోహెల్.