Sonam Kapoor: వామ్మో.. సర్వెంట్స్ కోసం 51 కోట్ల ఫ్లాట్స్.. సోనమ్ కపూర్ లగ్జరీ మాములుగా లేదుగా!
సోనమ్ కపూర్(Sonam Kapoor), ఆనంద్ అహుజా తమ సర్వెంట్స్ కోసం లండన్ లో ఏకంగా రూ.51 కోట్ల ఫ్లాట్స్ కొన్నారట.
Sonam Kapoor, Anand Ahuja buy 50 crore flats for servant housing
Sonam Kapoor: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజా లండన్‌లోని అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం, వారు ఈ ప్రాంతంలో దాదాపు రూ.270 కోట్ల భారీ వ్యయంతో ఒక పురాతన భవనాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భవనంలో భారీ ఎత్తున రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. అయితే, తాజాగా ఈ దంపతులు తమ సర్వెంట్స్ వసతి కోసం అదే ప్రాంతంలో రూ.51.4 కోట్ల విలువైన ఐదు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. దాంతో, ఆ వార్తలు లండన్‌లో తీవ్ర వివాదానికి దారితీసింది.
Peddi Censor: వామ్మో.. ‘పెద్ది’లో ఇన్ని బూతులా.. ‘సరుకు సామాను’తో సహా.. ఎన్ని కట్స్ పడ్డాయో తెలుసా?
ఈ కొత్త ఫ్లాట్ల కొనుగోలు ఆ భవనంలో నివసించే స్థానిక నివాసితులలో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని రేకెత్తించింది. సోనమ్ కపూర్ కుటుంబానికి సంబంధం ఉన్న ఒక సంస్థే ఈ ఫ్లాట్లను కొనుగోలు చేసిందని, తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆ ఫ్లాట్లను ‘సోషల్ హౌసింగ్’ కింద ఇతరులకు కేటాయిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తమను బెదిరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, సోనమ్(Sonam Kapoor) ప్రతినిధులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఈ కొనుగోళ్లతో తమకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని, కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసమే ఆ ఆస్తులను కొనుగోలు చేసినట్లు వారు స్పష్టం చేశారు.
లండన్, ఢిల్లీ, ముంబైలలో కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఈ జంటకు బిలియనీర్ నేపథ్యం ఉంది. ఆనంద్ అహుజా ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ ‘షాహీ ఎక్స్‌పోర్ట్స్’ కుటుంబానికి చెందినవారే కాకుండా, భానే, వెజ్‌నాన్‌వెజ్ సంస్థలకు అధిపతిగా ఉన్నారు. 2018లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2022లో మొదటి కుమారుడు వాయు జన్మించగా, ఈ ఏడాది 2026 మార్చిలోనే వారు తమ రెండో కుమారుడు రుద్రలోక్ కపూర్ అహుజాకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ లండన్ ఆస్తుల వివాదం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
