Site icon 10TV Telugu

Sonam Kapoor-Rana : క్ష‌మాప‌ణ‌లు చెప్పినా.. రానాకి సోనమ్‌ కపూర్ కౌంటర్ ఇచ్చిందా..? ఇన్‌స్టా పోస్ట్ వైరల్..!

Sonam Kapoor - Rana Daggubati

Sonam Kapoor - Rana Daggubati

Sonam Kapoor – Rana Daggubati : రానా దగ్గుబాటి ఇటీవల దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కింగ్ అఫ్ కోత(King of Kotha) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాట్లాడుతూ గతంలో జరిగిన ఒక విషయం చెప్పుకొచ్చాడు. ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తో కలిసి దుల్కర్ ఒక హిందీ సినిమా చేస్తున్న సమయంలో.. షూటింగ్స్ మధ్యలో ఆ హీరోయిన్ దుల్కర్ ని చాలా ఇబ్బందికి గురి చేసిందని, షూటింగ్ కి నిలిపి ఫోన్స్ మాట్లాడేదని, ఈ విషయంలో రానా తన స్నేహితులైన ఆ మూవీ నిర్మాతలను కూడా తిట్టినట్లు చెప్పుకొచ్చాడు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఆ హీరోయిన్ ఎవరనే చర్చ మొదలవడం, కొందరు ఆమె ఎవరో కాదు ‘సోనమ్ కపూర్’ అంటూ కామెంట్స్ చేయడంతో నెట్టింట ఆమె పై అనేక ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. దీనిపై మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా రానా స్ప‌ష్ట‌త నిచ్చాడు. తాను మాట్లాడిన మాటలతో సోనమ్ పై బాగా వ్యతిరేకత చూపించార‌ని, అది త‌న‌కు చాలా ఇబ్బందిగా ఉందని రానా చెప్పుకొచ్చాడు. ‘ఆమె కూడా నా స్నేహితురాలే. నేను సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశాను. నా మాటలు తప్పుగా అర్ధం చేసుకొని ప్రమోట్ చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేను గౌరవంగా భావించే సోనమ్ కపూర్ కి, దుల్కర్ సల్మాన్ కి నా హృదయపూర్వక క్షమాపణలు తెలియచేస్తున్నాను. ఇప్పటికైనా ఈ ఊహాగానాలకు, వార్తలకు ముగింపు పలకాలని కోరుకుంటున్నాను. అర్ధం చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు.’ స‌ద‌రు ట్వీట్‌లో రానా రాసుకొచ్చాడు.

ఇంత‌టితో వివాదం ముగిసింద‌ని అంద‌రూ బావించారు. అయితే.. రానా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ప్ప‌టికీ సోన‌మ్ క‌పూర్ కోపం త‌గ్గిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో అమెరికన్ యాక్టివిస్ట్ ఎలినార్ రూజ్వెల్ట్ చెప్పిన కోట్‌ను షేర్ చేసింది. ‘సంకుచిత మ‌న‌స్త‌త్వం క‌లిగిన వారు ఇత‌రుల గురించి మాట్లాడుతారు. సాధార‌ణ మ‌న‌షులు సంఘ‌ట‌న‌ల గురించి మాట్లాడుతారు. మేధావులు మాత్ర‌మే నూత‌న ఆలోచ‌న‌ల గురించి చ‌ర్చించుకుంటారు.’ అనే కోట్ ను షేర్ చేసింది. ఈ కోట్స్ రానా ఉద్దేశించి చేసిన‌వే అయి ఉంటాయ‌ని ప‌లువురు నెటీజ‌న్లు అంటున్నారు.

Sonam Kapoor instagram story

Exit mobile version