Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన పాటలు ఇవే..

నేడు(సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఎక్కడ చూసినా పవన్ మానియానే కనిపిస్తుంది. అభిమానులైతే స్పెషల్ షోలతో పండుగ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కేవలం నటుడిగానే కాకుండా రచయితగా,దర్శకునిగా, స్టంట్ మాస్టర్ గా, డాన్స్ మాస్టర్ గా మరియు సింగర్ గాను తనదైన ముద్ర వేశారు. అతను పాడిన పాటలు చూద్దాం....

Pawan Kalyan: నేడు(సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఎక్కడ చూసినా పవన్ మానియానే కనిపిస్తుంది. అభిమానులైతే స్పెషల్ షోలతో పండుగ చేసుకుంటున్నారు. కాగా పవన్ రాజకీయ వ్యవహారాలలో నిమగ్నమవ్వగా సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చాడు. అయితే సెట్స్ మీద ఉన్న ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ నుండి ఈరోజు ఉదయం ఓ ‘పవర్ గ్లాన్స్’ టీజర్‌ను పవన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇక పవన్ కి సోషల్ మీడియా వేదికగా పలు సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు, నెటిజనులు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కేవలం నటుడిగానే కాకుండా రచయితగా,దర్శకునిగా, స్టంట్ మాస్టర్ గా, డాన్స్ మాస్టర్ గా మరియు సింగర్ గాను తనదైన ముద్ర వేశారు.

పవన్ పుట్టినరోజు సందర్భంగా ఒకసారి అతను పాడిన పాటలు చూద్దాం.
-> ఎమ్ పిల్ల మాటాడవా (తమ్ముడు)
-> తాటి చెట్టు ఎక్కలేడు (తమ్ముడు)
-> బైబైయే బంగారు రమణమ్మ (ఖుషి)
-> నువ్వు సారా తాగుట (జానీ)
-> రావోయి మా ఇంటికి (జానీ)
-> పాపారాయుడు (పంజా)
-> కాటమ రాయుడా (అత్తారింటికిదారేది)
-> రాజులకి రాజు పోతురాజు (జనసేన ప్రైవేట్ సాంగ్)
-> కొడకా కోటేశ్వర్ రావు (అజ్ఞాతవాసి)
ఈ పాటలతో పవన్ ఫాన్స్ లో ఫుల్ జోష్ ని నింపారు. భవిషత్తులో కూడా పవన్ మరిన్ని పాటలు పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు