Sonu Sood : థాయ్‌లాండ్‌ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా సోనూసూద్‌..

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Sonu Sood appointed as brand ambassador and advisor for Thailand tourism

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సినిమాల్లో విల‌న్ గా నటించే ఆయ‌న నిజ జీవితంలో ఎంతో మందికి హీరో. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆయ‌న చేసిన ప‌నుల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. నేటికి కూడా ఆయ‌న త‌న ఫౌండేష‌న్ ద్వారా క‌ష్టాల్లో ఉన్న‌వారికి సాయం చేస్తూ ఉన్నారు. తాజాగా థాయ్‌లాండ్‌ టూరిజం బ్రాండ్ అంబాసిడర్, సలహాదారుగా సోనూ సూద్ నియ‌మితుల‌య్యారు.

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా సోనూ సూద్ పంచుకున్నారు. థాయ్‌లాండ్‌ టూరిజం బ్రాండ్ అంబాసిడర్, సలహాదారుగా నియ‌మించ‌బ‌డ‌డాన్ని ఎంతో గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. త‌న కుటుంబంతో క‌లిసి మొద‌టి అంత‌ర్జాతీయ ప‌ర్య‌ట‌న కోసం థాయ్‌లాండ్ దేశానికి వెళ్లిన‌ట్లుగా చెప్పాడు.

Lucky Baskhar : ల‌క్కీ భాస్క‌ర్ మూవీ.. వంద కోట్ల‌కు చేరువ‌గా క‌లెక్ష‌న్స్‌.. 10 రోజుల్లో ఎంతంటే?

ఇప్పుడు ఇదే దేశానికి టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మితులు కావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. థాయ్‌లాండ్‌ గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి, అక్క‌డి అంద‌మైన ప్ర‌దేశాలు, ప్ర‌కృతి ర‌మ‌ణీయం గురించి తెలియ‌జేయ‌డానికి, స‌ల‌హాలు ఇచ్చేందుకు ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పారు.