Sonu Sood Political Entry : ముంబై మేయర్ అభ్యర్థిగా సోనూసూద్.. స్పందించిన రియల్ హీరో

ముంబై మేయర్ అభ్యర్థిగా సోనూసూద్ పోటీ చేస్తున్నారని వచ్చిన వార్తలపై స్పందించారు రియల్ హీరో.. ట్విట్టర్ ద్వారా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.

Sonu Sood Political Entry

Sonu Sood Political Entry  : బృహత్‌ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ ఎన్నికలపై అన్ని ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ముంబై పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖులతో మంతనాలు జరుపుతుంది. సినీగ్లామర్ తోపాటు సేవాభావం ఉన్న నటులను మేయర్ గా నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే రియల్ హీరో సోనూసూద్ పేరు బయటకు వచ్చింది.

మేయర్ అభ్యర్థిగా సోనూసూద్ దిగుతున్నారని ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి రేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కొడుకు, నటుడు రితేష్ దేశ్‌ముఖ్, మోడల్, ఫిట్‌నెస్ పర్సనాల్టీ మిలింద్ సోమన్ తో పాటు సోనూ సూద్ ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్లు, ఇందుకోసం చర్చలు జరిపినట్లు వార్తలు చెక్కర్లు కొట్టాయి.

అయితే తన పేరు తెరపైకి రావడంతో స్పందించారు. ‘ఇది నిజం కాదు. నేను సాధారణ వ్యక్తిగా చాలా సంతోషంగా ఉన్నాను’అని ట్వీట్‌ చేశాడు. అయితే అత్యధిక మంది నెటిజన్స్‌ మాత్రం సోనూ భాయ్‌ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. మరికొంత మంది మాత్రం ఈ బురదలోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.