ఒక్క రోజులో ఎన్ని మెసేజ్‌లో?.. స్పందించకపోతే క్షమించండి..

  • Publish Date - August 20, 2020 / 12:09 PM IST

‘జనాతాగ్యారేజ్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘‘ఆపద అని తెలిస్తే ఎగబడిమరీ వెళ్లిపోతున్నాం.. ఇది మా జనతాగ్యారేజ్ నెంబర్, ఏ కష్టమొచ్చినా ఫోన్ చేయండి’’ అనే డైలాగ్స్ చెప్తాడు. ఈ మాటలు నటుడు సోనూ సూద్‌కు చక్కగా సరిపోతాయి.



ఇప్పటివరకు కొన్ని వేల మంది వలస కార్మికులకు అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నాడు సోనూ సూద్. ఆపదలో ఉన్నవారికి, సహాయం అడిగిన వారికి నేనున్నానంటూ చేయి అందిస్తున్నాడు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా సోనూ సూద్‌కు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వీలైనంత మందికి సోనూ తన టీమ్ ద్వారా సహాయం అందిస్తున్నాడు.



ఈ నేపథ్యంలో సోనూ సోషల్ మీడియా ఖాతాలకు వేల సంఖ్యలో మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘‘19000 ఎఫ్‌బీ మెసేజ్‌లు.. 4812 ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు.. 6741 ట్విట్టర్ మెసేజ్‌లు.. సహాయం కోరుతూ ఈ ఒక్క రోజు వచ్చిన మెసేజ్‌లు ఇవి. సగటున ప్రతిరోజూ ఇంతే స్థాయిలో మెసేజ్‌లు అందుకుంటున్నా. ఇందులో ప్రతి ఒక్కరి మెసేజ్‌కు స్పందించడం దాదాపు అసాధ్యం. అయినప్పటికీ నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ఎవరి మేసేజ్‌కైనా స్పందించలేకపోతే క్షమించండి’’ అంటూ సోనూ ట్వీట్ చేశారు.


ట్రెండింగ్ వార్తలు