sonusood said please construct schools or hospitals instead his temples
Sonusood : నటుడు సోనూసూద్ కరోనా సమయంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు చేసి, చేయూతని అందించి ఒక్కసారిగా మరింత పాపులర్ అయ్యారు. వలస కార్మికుల్ని సొంతూళ్లకు తరలించడం, విదేశాల్లో చిక్కుకున్న వారిని తెప్పించడం, తిండి, ఉండటానికి స్థలం ఏర్పాటు చేయడం, ఆర్ధిక సాయం చేయడం.. అలా కరోనా సమయంలో ఎంతోమందికి అండగా నిలిచి వారికి దేవుడయ్యాడు సోనూసూద్.
కరోనా లాక్ డౌన్ తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలని ఆపకుండా పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి వివిధ రకాలుగా సహాయం చేయడం మొదలుపెట్టాడు. చదువు చెప్పించడం, ఉద్యోగాలు ఇప్పించడం, బ్రతుకు తెరువు చూపించడం.. లాంటి పనులు ఇంకా చేస్తూనే ఉన్నాడు. దీంతో చాలామంది సోనూసూద్ ని అభినందిస్తున్నారు. కొంతమంది తమకు చేసిన సాయానికి ఒక్కొక్కరు ఒక్కోలా ఋణం తీర్చుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ షాప్స్ కి సోనూసూద్ పేరు పెట్టుకుంటుంటే, మరికొంతమంది ఏకంగా సోనూసూద్ దేవుడు అంటూ గుడి కట్టారు. ఇప్పటికే భారతదేశంలో పలుచోట్ల సోనూసూద్ కి గుళ్ళు కట్టారు.
Rashmika Mandanna : 5 లగ్జరీ ఇళ్ళు కొన్న రష్మిక అంటూ వార్తలు.. కౌంటర్ ఇచ్చిన రష్మిక..
సిద్ధిపేట దగ్గర ఉన్న ఓ తండాలో కూడా సోనూసూద్ గుడిని గతంలోనే నిర్మించారు. తాజాగా సోనూసూద్ సిద్దిపేటకు విచ్చేసి ఈ గుడిని చూసి, ఇక్కడి ప్రజలతో, మీడియాతో మాట్లాడారు. సోనూసూద్ మాట్లాడుతూ.. నేను చేయగలిగినంత చేసే ఓ సామాన్యుడిని. ఇలా గుళ్ళు కట్టడం, పూజలు చేయటం లాంటివి చేయకూడదు అనే అనుకుంటాను. వారు నా మీద ప్రేమతో చేశారని నాకు తెలుసు. కానీ ఇకపై అలా చేయవద్దని నా అభిమానులకి చెప్తున్నాను. నాకు గుడి కట్టాలి అనుకుంటే బడి కానీ హాస్పిటల్ కానీ కట్టమని చెప్తున్నాను అని తెలిపాడు. దీంతో మరోసారి ప్రజలు సోనూసూద్ ని అభినందిస్తున్నారు.