×
Ad

Sooraj Pancholi : జియా ఖాన్ ఆత్మహత్య కేసు తీర్పు తర్వాత.. సూరజ్ ఏం చేశాడో తెలుసా??

ఇటీవలే ఈ కేసులో CBI కోరు తీర్పునిస్తూ సూరజ్ పంచోలిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో మరోసారి జియా ఖాన్ కేసు వార్తల్లో నిలిచింది.

Sooraj Pancholi visited Mumbai vinayaka temple after Jiah Khan case result

Sooraj Pancholi :  2013లో బాలీవుడ్(Bollywood) నటి జియా ఖాన్(Jiah Khan) తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. జియా ఆత్మహత్య అప్పట్లో బాలీవుడ్ లో సంచలనంగా మారింది. పోలీసులు ఈ ఆత్మహత్య కేసు దర్యాప్తులో జియా ఖాన్ రాసిన ఓ లెటర్ ని తన ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. జియా ఖాన్ నటుడు సూరజ్ పంచోలితో(Sooraj Pancholi) ప్రేమలో ఉందని, అతను తనని వేధిస్తున్నాడని, అతనితో చాలా సమస్యలు ఉన్నాయని ఆ లేఖలో రాసింది. దీని ఆధారంగా నటుడు సూరజ్ పంచోలిని అరెస్ట్ చేశారు పోలీసులు.

మొదట సూరజ్ కి బెయిల్ నిరాకరించినా నెల రోజులు జైలులో ఉన్న అనంతరం కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఈ కేసులో సూరజ్ తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను ప్రేమించిన అమ్మాయిని కోల్పోయానని తెలిపాడు. జియా ఖాన్ తల్లి కోరిక మేరకు ఈ కేసు CBI కి వెళ్ళింది. ఈ సంఘటన జరిగిన పదేళ్ల తర్వాత ఇటీవలే ఈ కేసులో CBI కోరు తీర్పునిస్తూ సూరజ్ పంచోలిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో మరోసారి జియా ఖాన్ కేసు వార్తల్లో నిలిచింది.

ఇక సూరజ్ పంచోలిని జియా ఖాన్ ఆత్మహత్య కేసులో నిర్దోషిగా విడుదల చేయటంతో సూరజ్ తాజాగా ముంబైలోని ప్రముఖ ఆలయం అయిన సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించాడు. ఈ కేసులో నిర్దోషిగా బయటకు వచ్చినందుకు వినాయక స్వామిని దర్శించుకోవటానికి వచ్చినట్టు మీడియాతో తెలిపాడు సూరజ్ పంచోలి. సూరజ్ ఆలయానికి రావడంతో పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయానికి వచ్చిన పలువురు భక్తులు నటుడు సూరజ్ పంచోలితో ఫొటోలు దిగారు.

Jiah Khan : బాలీవుడ్ హీరోయిన్ ఆత్మహత్య కేసులో పదేళ్ల తర్వాత తీర్పు.. నిర్దోషిగా విడుదలైన నిందితుడు..

బాలీవుడ్(Bollywood) నటి జియా ఖాన్(Jiah Khan) అమితాబ్(Amithab) సరసన నిశ్శబ్ద్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించింది జియా. అయితే 2013 లో జియా తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.