ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హద్దురా!’

ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హద్దురా!’

Updated On : February 26, 2021 / 12:47 PM IST

Soorarai Pottru: విలక్షణ నటుడు సూర్య, అపర్ణ బాలమురళి జంటగా.. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ‘సింప్లి ఫ్లై’ ఆధారంగా తెరకెక్కిన ‘సూరరై పోట్రు’.. (ఆకాశం నీ హద్దురా) తమిళ్, తెలుగు భాషల్లో ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది.

సూర్య, అపర్ణల నటన, దర్శకురాలు సుధ కొంగర టేకింగ్‌కి సినీ ప్రముఖుల నుండి కూడా మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ బరిలో సూర్య సినిమా నామినేషన్ సాధించింది.

Soorarai Pottru

ఇటీవల మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఆస్కార్ రేసులో నుండి తప్పుకోగా అందరూ ‘ఆకాశం నీ హద్దురా’ నామినేషన్ సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పుడు ఫీచర్ ఫిలింస్ లిస్టులో ఈ మూవీ చోటుదక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందానికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Soorarai Pottru