Soothravakyam
Soothravakyam : షైన్ టామ్ చాకో, విన్సీ అలోషియస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళం సినిమా ‘సూత్రవాక్యం’. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మాణంలో యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సూత్రవాక్యం సినిమా మలయాళంలో జులై 11న రిలీజయింది. తెలుగు వర్షన్ నేడు ఆగస్టు 21 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.(Soothravakyam)
కథ విషయానికొస్తే.. ఓ ఊళ్ళో క్రిస్టో జేవియర్(షైన్ టామ్ చాకో) పోలీసాఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. క్రిష్టో అక్కడ స్కూల్ పిల్లలకు మ్యాథ్స్ ట్యూషన్ ఫ్రీగా చెప్తూ వాళ్లకు దగ్గర అవుతాడు. దీంతో ఆ స్కూల్ మ్యాథ్స్ టీచర్ నిమిష(విన్సీ)కు ఇది నచ్చదు. కానీ తర్వాత ఇద్దరూ క్లోజ్ అవుతారు. క్రిస్టో ట్యూషన్ చెప్పే స్టూడెంట్స్ లో ఆర్య అనే అమ్మాయిని వాళ్ళ అన్నయ్య వివేక్ కొడుతూ ఉంటాడు. క్రిస్టో ఓ సారి కొట్టి వార్నింగ్ ఇచ్చినా మారడు. అదే ఊళ్ళో ఓ బావిలో ఎక్కడెక్కడ్నుంచి వచ్చి చెత్త వేసి వెళ్తూ ఉంటారు. ఈ సమస్యని పోలీసుల దృష్టికి తీసుకు వస్తారు.
ఆర్యని వివేక్ ఓ రోజు దారుణంగా కొడతాడు. ఆ నెక్స్ట్ డే నుంచి వివేక్ కనపడడు. అదే సమయంలో క్రిస్టోకి ఓ పేస్ మేకర్ దొరికి బెట్సి అనే అమ్మాయి మర్డర్ కి గురైందని తెలుస్తుంది కానీ తన బాడీ ఏమైందో తెలీదు. అసలు బెట్సి ని ఎవరు చంపారు? వివేక్ ఏమయ్యాడు? వాళ్ళిద్దరికీ ఏంటి సంబంధం? ఆ బావిలో చెత్త వేసేది ఎవరు? ఆ బావికి ఈ మర్డర్ కి సంబంధం ఏంటి? ఆర్యని వాళ్ళ అన్నయ్య ఎందుకు కొడుతూ ఉంటాడు? ఈ కేసుని క్రిస్టో ఎలా సాల్వ్ చేసాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Vishwambhara : ‘విశ్వంభర’ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్.. వీడియో వైరల్.. రిలీజ్ ఎప్పుడంటే..
మలయాళం థ్రిల్లర్స్, అందులోను పోలీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని తెలిసిందే. పోలీస్ పిల్లలకు ట్యూషన్ చెప్పడం, వాళ్ళతో మంచిగా ఉండటం అనే కాన్సెప్ట్ బాగుంది. దాన్ని బాగా చూపించారు. అయితే మొదటి అరగంట అదే కాస్త సాగదీశారు. ఆర్యని వాళ్ళ అన్నయ్య కొడుతుండటం అని తెలిసిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది. ఇక వివేక్ కనపడక పోవడం, ఓ అమ్మాయి మర్డర్ అయిందని తెలిసిన దగ్గర్నుంచి సస్పన్స్ థ్రిల్లర్ సినిమాలా సాగుతుంది.
అయితే సినిమాలో వివేక్ ఏమయ్యాడో మనకు ముందే చూపించేస్తారు కానీ పోలీసులు దాన్ని ఎలా కనిపెట్టారు అనేది చూడాలి. కాబట్టి థ్రిల్లింగ్ కాస్త తగ్గుతుంది. అక్కడక్కడా స్లో నేరేషన్, కాస్త సాగదీత ఉన్నా మంచి కాన్సెప్ట్ ని ఒక మర్డర్ కేసుని బాగానే డీల్ చేసారు. క్లైమాక్స్ మాత్రం హడావిడిగా ఒకరితోనే అంతా చెప్పించేసి సింపుల్ గా అయిపోయింది అనిపించారు. మళయాలం థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్ళు ఈ సూత్రవాక్యంను చూసేయొచ్చు ఈటీవీ విన్ ఓటీటీలో.
నటీనటుల పర్ఫార్మెన్స్.. షైన్ టామ్ చాకో మంచి పోలీస్ పాత్రలో చాలా బాగా నటించి మెప్పించాడు. టీచర్ పాత్రలో విన్సీ అలోషియస్ అక్కడక్కడా సింపుల్ గా కనిపించి అలరిస్తుంది. దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్, స్కూల్ పిల్లలుగా నటించిన వాళ్ళు.. మిగిలిన అందరూ వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
Also Read : Comedian Rama Chandra : ‘వెంకీ’లో ఫుల్ గా నవ్వించిన కమెడియన్.. ఇప్పుడు పక్షవాతంతో మంచం మీద..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. తెలుగు డబ్బింగ్ పాటలు మాత్రం వర్కౌట్ అవ్వలేదు. తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ కూడా కొన్ని సీన్స్ లో మిస్ మ్యాచ్ అయ్యాయి. పోలీస్ పిల్లలకు పాటలు చెప్పడం అనే పాయింట్ ని కన్విన్స్ గా చూపిస్తూనే ఒక మర్డర్ మిస్టరీని బాగానే రాసుకున్నారు. ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్, అక్కర్లేని కామెడీ సీన్స్ కట్ చేస్తే బాగుండు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘సూత్రవాక్యం'(Soothravakyam)సినిమా పోలీసుల మంచితనాన్ని చూపిస్తూ తెరకెక్కిన ఓ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.