Soothravakyam : ఓటీటీలో దూసుకుపోతున్న థ్రిల్లర్ సినిమా.. అస్సలు మిస్ అవ్వకండి..

మలయాళం థ్రిల్లర్ సినిమా సూత్రవాక్యం ఓటీటీలో దూసుకుపోతుంది. (Soothravakyam)

Soothravakyam

Soothravakyam : మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో, విన్సీ అలోషియస్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మలయాళం సినిమా ‘సూత్రవాక్యం’. ఈ సినిమా తెలుగులో కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మాణంలో యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.(Soothravakyam)

సూత్రవాక్యం సినిమా మలయాళంలో జులై 11న రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. పోలీసులు పిల్లలకు పాటలు చెప్పడం అనే కొత్త కాన్సెప్ట్ తో పాటు ఓ మర్డర్ మిస్టరీ తో థ్రిల్లర్ సినిమాలా చిత్రీకరించారు. సూత్రవాక్యం సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తాజాగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ అందుకొని దూసుకుపోతుంది. ఈ సినిమా నిర్మాత శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఈ థ్రిల్లర్ సినిమాని చూడకపోతే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూసేయండి.

Also Read : Kirrak RP : నా ఫ్యామిలీని చంపేస్తాము అని బెదిరిస్తున్నారు.. నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.. కిరాక్ ఆర్పీ కామెంట్స్ వైరల్..

సూత్రవాక్యం కథేంటంటే.. ఓ ఊళ్ళో క్రిస్టో జేవియర్(షైన్ టామ్ చాకో) పోలీసాఫీసర్ గా పనిచేస్తూ అక్కడ స్కూల్ పిల్లలకు మ్యాథ్స్ ట్యూషన్ ఫ్రీగా చెప్తాడు. క్రిస్టో ట్యూషన్ చెప్పే స్టూడెంట్స్ లో ఆర్య అనే అమ్మాయిని వాళ్ళ అన్నయ్య వివేక్ కొడుతూ ఉంటాడు. క్రిస్టో ఓ సారి కొట్టి వార్నింగ్ ఇచ్చినా మారడు. అదే ఊళ్ళో ఓ బావిలో ఎక్కడెక్కడ్నుంచి వచ్చి చెత్త వేసి వెళ్తూ ఉంటారు. ఆర్యని వివేక్ ఓ రోజు దారుణంగా కొడతాడు. ఆ నెక్స్ట్ డే నుంచి వివేక్ కనపడడు. అదే సమయంలో క్రిస్టోకి ఓ పేస్ మేకర్ దొరికి బెట్సి అనే అమ్మాయి మర్డర్ కి గురైందని తెలుస్తుంది కానీ తన బాడీ ఏమైందో తెలీదు. అసలు బెట్సి ని ఎవరు? ఆమెని ఎవరు చంపారు? వివేక్ ఏమయ్యాడు? వాళ్ళిద్దరికీ ఏంటి సంబంధం? ఆ బావిలో చెత్త వేసేది ఎవరు? ఆ బావికి ఈ మర్డర్ కి సంబంధం ఏంటి? ఆర్యని వాళ్ళ అన్నయ్య ఎందుకు కొడుతున్నాడు? ఈ కేసుని క్రిస్టో ఎలా సాల్వ్ చేసాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Soothravakyam : ‘సూత్ర వాక్యం’ మూవీ రివ్యూ.. మలయాళం మర్డర్ మిస్టరీ తెలుగులో..

Also See : Samantha : సమంత లేటెస్ట్ ఫొటోలు చూశారా?