Kirrak RP : నా ఫ్యామిలీని చంపేస్తాము అని బెదిరిస్తున్నారు.. నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.. కిరాక్ ఆర్పీ కామెంట్స్ వైరల్..
జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ తాజాగా రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. (Kirrak RP)

Kirrak RP
Kirrak RP : జబర్దస్త్ లో కమెడియన్ గా, టీమ్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కిరాక్ ఆర్పీ. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించాడు. పలు కారణాలతో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన ఆర్పీ గత ఎన్నికల ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ వేరే పార్టీల నాయకులపై విమర్శలు చేస్తూ రెగ్యులర్ గా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ తన ఫుడ్ బిజినెస్ చూసుకుంటూ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడు.(Kirrak RP)
తాజాగా జబర్దస్త్ మహీధర్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అతనికి కిరాక్ ఆర్పీ క్లోజ్ అవ్వడంతో ఇంటర్వ్యూలో ఆర్పీకి కాల్ చేశారు. ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ జబర్దస్త్, మహీధర్ గురించి మాట్లాడిన తర్వాత తన రాజకీయాల గురించి కూడా మాట్లాడాడు.
Also Read : OG Idol Party : ఆహా ఓటీటీలో OG ఐడల్ పార్టీ.. ప్రియాంక మోహన్ ఎంట్రీ.. ప్రోమో వైరల్..
కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. చంద్రబాబు గారి విజన్, లోకేష్ గారి కష్టం నాకు ఇష్టం. వాళ్ళు పార్టీని నిలబెట్టే విధానం నాకు విపరీతమైన ఇష్టం. అందుకే మా ఇంట్లో వాళ్ళను టార్గెట్ చేసి తిడుతున్నా, చంపేస్తాము అని బెదిరిస్తున్నా భయపడకుండా ముందుకు వెళ్తున్నాను అంటే వాళ్ళిద్దరి మీద ఉన్న గౌరవం, ప్రేమ. నేను ఏ రోజూ పోస్టుల గురించి ఆశించలేదు. మనం కష్టపడితే వస్తే ఓకే, లేకపోతే లేదు, నేను ఆశించను. నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం. ఆ తర్వాతే కమెడియన్ అయినా, నా బిజినెస్ అయినా. నారా లోకేష్ గారు, చంద్రబాబు గారితో ఉండి వాళ్ళ కోసం పనిచేస్తాను. పార్టీ ఆదేశాల మేరకు నేను పనిచేస్తాను నేను ఏమి కోరుకోను అని తెలిపాడు.
Also See : Nilakhi patra : టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న ఒడియా బ్యూటీ.. నీలఖి పాత్ర ఫొటోలు..