OG Idol Party : ఆహా ఓటీటీలో OG ఐడల్ పార్టీ.. ప్రియాంక మోహన్ ఎంట్రీ.. ప్రోమో వైరల్..

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లో OG ఐడల్ పార్టీ ఎపిసోడ్ ప్రోమో మీరు కూడా చూసేయండి.. (OG Idol Party)

OG Idol Party : ఆహా ఓటీటీలో OG ఐడల్ పార్టీ.. ప్రియాంక మోహన్ ఎంట్రీ.. ప్రోమో వైరల్..

OG Idol Party

Updated On : September 17, 2025 / 4:46 PM IST

OG Idol Party : ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సింగింగ్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రతి శుక్ర, శనివారాలు కొత్త ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షోలో తమన్, సింగర్ కార్తీక్, గీతామాధురిలు జడ్జీలుగా ఉండగా శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ లు హోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ వారం OG ఐడల్ పార్టీ అని స్పెషల్ ఎపిసోడ్ చేసారు.

ఈ OG ఐడల్ పార్టీ ఎపిసోడ్ కి OG సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ గెస్ట్ గా హాజరైంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. ఇక ఈ షోలో పాడే కంటెస్టెంట్స్ పవన్ కళ్యాణ్ మాస్కులతో ఎంట్రీ ఇచ్చారు. సింగర్ శృతి రంజని OG లోని సువ్వి సువ్వి సాంగ్ పాడి అలరించింది. స్టేజిపై పవన్ కళ్యాణ్ కటౌట్స్ కూడా పెట్టారు. ఓ సింగర్ ప్రియాంక మీద పాట పాడాడు. ఓ కంటెస్టెంట్ కి ప్రియాంక OG హుడీని గిఫ్ట్ గా ఇచ్చింది. ప్రియాంక కూడా OG అని టైటిల్ ఉన్న చీర కట్టుకొచ్చింది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Also See : Nilakhi patra : టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న ఒడియా బ్యూటీ.. నీలఖి పాత్ర ఫొటోలు..

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లో OG ఐడల్ పార్టీ ఎపిసోడ్ ప్రోమో మీరు కూడా చూసేయండి..

 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న OG సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

Also Read : VTV Ganesh : నా కెరీర్ నాశనం చేయొద్దు ప్లీజ్.. నాకు తెలుగు ఇండస్ట్రీ మెయిన్.. మూవీ టీమ్ తో స్టార్ కమెడియన్ గొడవ..