×
Ad

Soul Trip : టాలీవుడ్ స్టార్స్ తో ట్రావెల్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో.. సోల్ ట్రిప్..

త్వ‌ర‌లోనే ఈ టాక్ షో ఓటీటీలో రానుంది. (Soul Trip)

Soul Trip

Soul Trip : ఇటీవల టాక్ షోలు చాలా వస్తున్నాయి. ఈ టాక్ షోలు అన్ని కొత్తకొత్తగా ట్రై చేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా హోస్ట్ గా మారి టాక్ షోలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో కొత్త టాక్ షో రాబోతుంది. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్మెంట్ స‌మ‌ర్ప‌ణ‌లో ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో రానుంది. ‘సోల్ ట్రిప్’ అనే టైటిల్ తో టాలీవుడ్ స్టార్స్ తో ఈ టాక్ షో ప్రేక్షకుల‌ను అల‌రించ‌నుంది.(Soul Trip)

పోస్ట‌ర్, అన్వేషి.. లాంటి పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో, నిర్మాత విజ‌య్ దాట్ల త‌న సొంత బ్యాన‌ర్ గండ‌భేరుండ ఆర్ట్స్‌పై హోస్ట్ గా మారి ఈ సెల‌బ్రిటీ టాక్‌ షో ని మొదలుపెట్టారు. ఇప్పటికే సీజ‌న్‌1 షూటింగ్ కూడా పూర్తయింది. త్వ‌ర‌లోనే ఈ టాక్ షో ఓటీటీలో రానుంది.

Also See : చంద్రబాబు భార్య, పవన్ భార్య ఒకే ఫ్రేమ్ లో.. నమస్కరించిన లోకేష్.. ఫొటోలు వైరల్..

ఇప్పటికే జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, కమెడియ‌న్ అలీ, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, వ‌ర్ష బొల్ల‌మ్మ.. పలువురితో ఈ టాక్ షో షూటింగ్ పూర్తవగా నేడు గ‌ణ‌తంత్య దినోత్స‌వం సంద‌ర్భంగా సోల్ ట్రిప్ టాక్ షో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారు. మరి ఈ ట్రావెల్ బేస్డ్ టాక్ షో ఎలా ఉంటుందో, ఇందులో మన సెలబ్రిటీస్ ఏం మాట్లాడతారో చూడాలి.

Also Read : Ranabaali : విజయ్, రష్మిక కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. బ్రిటిష్ వాళ్లపై పోరాడిన యోధుడు.. హాలీవుడ్ హీరో విలన్ గా..