చంద్రబాబు భార్య, పవన్ భార్య ఒకే ఫ్రేమ్ లో.. నమస్కరించిన లోకేష్.. ఫొటోలు వైరల్..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్ లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. దీంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేసారు. పవన్ భార్య వద్దకు వచ్చి మంత్రి లోకేష్ ఆమెకు నమస్కరించాడు. ఇలా సీఎం, డిప్యూటీ సీఎం ఫ్యామిలీలు ఒకేచోట కలవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.













