Mohan Babu – Soundarya : మోహన్ బాబు ఇష్యూ.. దివంగ‌త న‌టి సౌంద‌ర్య భ‌ర్త బ‌హిరంగ లేఖ‌..

సౌంద‌ర్య భ‌ర్త ర‌ఘు స్పందించారు. మోహ‌న్ బాబుకు త‌మ‌కు ఎలాంటి ఆస్తి గొడ‌వ‌లు లేవని చెబుతూ ఓ బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు

Soundarya Husband responds allegations on Mohan Babu

దివంగ‌త న‌టి సౌంద‌ర్య మ‌ర‌ణం ప్ర‌మాద‌వ‌శాత్తూ జ‌రిగింది కాదంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. మోహ‌న్ బాబుకు, సౌంద‌ర్య‌కు ఆస్తి త‌గాదాలు వ‌చ్చాయ‌ని, ఆమెను ప్లాన్ చేసి చంపి ఉంటార‌ని అంటూ ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి నిర‌స‌నకు దిగిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ విష‌యం పై సౌంద‌ర్య భ‌ర్త ర‌ఘు స్పందించారు. మోహ‌న్ బాబుకు త‌మ‌కు ఎలాంటి ఆస్తి గొడ‌వ‌లు లేవని చెబుతూ ఓ బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు.

హైదరాబాద్ లోని సౌందర్య ఆస్తికి సంబందించి కొన్నిరోజులుగా తప్పుడు ప్రచారం జ‌రుగుతోంది. సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను. ఆయ‌న‌తో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు. వారి కుటుంబంతో సౌందర్య కుటుంబానికి 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. ఆయ‌న్ను నేను గౌరవిస్తాను, మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాం. ఆయ‌న‌తో మాకు ఎలాంటి ఆస్తి గొడవలు, లావాదేవీలు లేవు అని ర‌ఘు తెలిపారు.

Rukshar Dhillon : ‘రుక్సర్ థిల్లాన్’ ఫొటో ఇష్యూ ఇంకా అవ్వలేదా.. ఈవెంట్లో ఫొటోలు దిగలేదా? తియ్యలేదా? మధ్యలోనే వెళ్ళిపోయిన హీరోయిన్..

2004 ఏప్రిల్ 17న త‌న సోద‌రుడితో క‌లిసి ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెలుతున్న క్ర‌మంలో సౌంద‌ర్య‌ ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్ కుప్ప‌కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఆమె దుర్మ‌ర‌ణం చెందారు. కాగా.. ఈ ప్ర‌మాదానికి కొద్ది నెల‌ల ముందే ఆమె ర‌ఘు అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీరు పెళ్లిచేసుకుంది.