Teachers Day : టీచర్స్ డే స్పెషల్.. చిన్నప్పటి స్కూల్ ఫొటో షేర్ చేసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపడతారా?
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా?
- Saketh U
- Published On : September 5, 2024 / 03:36 PM IST
South Actress Shares Childhood School Group Photo and says find her
Teachers Day Find Actress : నేడు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ తన చిన్ననాటి ఫొటో సోషల్ మీడియా షేర్ చేసింది. తాను చిన్నప్పుడు స్కూల్ లో చదివేటప్పుడు తన క్లాస్ స్టూడెంట్స్ అంతా ఓ టీచర్ తో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఇందులో నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టండి అని ఫాలోవర్స్ కి పరీక్ష పెట్టింది.
Also Read : Darling Krishna – Milana Nagaraj : తల్లితండ్రులైన హీరో – హీరోయిన్.. పండంటి పాప..
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా? ఇటీవలే నటిగా 40 ఏళ్ళు కెరీర్ పూర్తిచేసుకున్న మీనా. చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మీనా ఆ తర్వాత హీరోయిన్ గా మారి సౌత్ లో స్టార్ హీరోయిన్ అయింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, టీవీ షోలలో కనిపిస్తూ అలరిస్తుంది. నటిగా 40 ఏళ్ళ కెరీర్ కూడా పూర్తిచేసుకుంది.
నేడు టీచర్స్ డే సందర్భంగా తన చిన్నప్పటి ఫొటో షేర్ చేసి అందులో తనని కనిపెట్టమని అడిగింది. దీంతో పలువురు ఫ్యాన్స్, నెటిజన్లు ఆ ఫొటోలో మీనా ఎక్కడుందో అని కనిపెట్టి కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటో చూసి మీరు కూడా మీనా ఇందులో ఎక్కడ ఉందో కనిపెట్టేయండి.
