Darling Krishna – Milana Nagaraj : తల్లితండ్రులైన హీరో – హీరోయిన్.. పండంటి పాప..
తాజాగా డార్లింగ్ కృష్ణ - మిలనా నాగరాజ్ జంట తల్లితండ్రులయ్యారు.
Darling Krishna – Milana Nagaraj : కన్నడ హీరో – హీరోయిన్ తల్లితండ్రులయ్యారు. కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ – హీరోయిన్ మిలనా నాగరాజ్ కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్‌టైల్ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాతో పరిచయం అయిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడి 2021లో పెళ్లి చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత కూడా మరో మూడు సినిమాల్లో నటించారు ఈ జంట.
Also Read : NTR : చేతికి గాయం అయి, నొప్పి ఉన్నా ఆ స్టెప్స్ ఎలా చేసావ్ బ్రో.. సినిమా, ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్..
ఇటీవల కొన్ని నెలల క్రితం మిలనా నాగరాజ్ తాను తల్లి కాబోతుందని ప్రకటించింది. తాజాగా ఈ జంట తల్లితండ్రులయ్యారు. మిలనా నాగరాజ్ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని డార్లింగ్ కృష్ణ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తాను తండ్రి అయ్యానని, తనకు కూతురు పుట్టిందని, నా భార్య ప్రగ్నెన్సీ జర్నీ చూసాక మహిళల మీద మరింత గౌరవం పెరిగిందని, ఇప్పుడు నేను కూతురు పెట్టినందుకు తండ్రిగా గర్వపడుతున్నాను అని తన భార్యతో కలిసి దిగిన బేబీ బంప్ ఫోటో షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.