NTR : చేతికి గాయం అయి, నొప్పి ఉన్నా ఆ స్టెప్స్ ఎలా చేసావ్ బ్రో.. సినిమా, ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్..
ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తన పాత స్టైల్ లో అదిరిపోయే స్టెప్స్ వేసాడు. అయితే ఈ స్టెప్స్ వేసినప్పుడు ఎన్టీఆర్ కి గాయం అయి ఉన్నా, కండల నొప్పి ఉన్నా అలాగే చేసాడట.

Jr NTR Danced for Davudi Song in Devara Even he Injured and Having Pain
Jr NTR : ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి నిన్న దావూది అంటూ మూడో సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కోసం ఏకంగా వీడియో సాంగ్ నే రిలీజ్ చేసేసారు మూవీ యూనిట్. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ కూడా స్టెప్పులు అదరగొట్టేసారు. దీంతో ఈ సాంగ్ వీడియో నిన్నటినుంచి ట్రేండింగ్ లో ఉంది.
Also Read : Mokshagna – Prasanth Varma : మోక్షజ్ఞ కొత్త సినిమా టైటిల్ ఇదేనా? పోస్టర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మ..
ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తన పాత స్టైల్ లో అదిరిపోయే స్టెప్స్ వేసాడు. అయితే ఈ స్టెప్స్ వేసినప్పుడు ఎన్టీఆర్ కి గాయం అయి ఉన్నా, కండల నొప్పి ఉన్నా అలాగే చేసాడట. దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సాంగ్ రిలీజయ్యాక ఒక ట్వీట్ చేసాడు. తన ట్వీట్ లో.. గాయం అయినప్పటికీ. కండరాల నొప్పులు ఉన్నప్పటికీ ఇంత మాసీ సాంగ్ ని స్టైలిష్ గా చేసాడు ఎన్టీఆర్. అతని డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని తెలిపారు.
Despite muscle spasm ,injury and pain @tarak9999 bro danced this pacy song #Daavudi effortlessly stylish .Hats off 👏👏 #Devara @SivaKoratala @RathnaveluDop @anirudhofficial #Janhvi Kapoor #sekar master @ramjowrites @Yugandhart_ @NTRArtsOfficial… pic.twitter.com/kZaONi1Hed
— Rathnavelu ISC (@RathnaveluDop) September 4, 2024
దీంతో ఈ పాట షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయం అయినా కండరాల నొప్పులు ఉన్నా అవి భరిస్తూనే సినిమా కోసం, ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులు ఎక్కడా గ్రేస్ తగ్గకుండా వేశాడు అని తెలుస్తుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని అభినందిస్తున్నారు.