Mokshagna – Prasanth Varma : మోక్షజ్ఞ కొత్త సినిమా టైటిల్ ఇదేనా? పోస్టర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మ..

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి సింబా రాబోతున్నాడు అని పోస్ట్ చేయడంతో బాలయ్య తనయుడి సినిమానే అని అంతా అనుకున్నారు.

Mokshagna – Prasanth Varma : మోక్షజ్ఞ కొత్త సినిమా టైటిల్ ఇదేనా? పోస్టర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మ..

Prasanth Varma Released a Poster with Simbaa Name Fans Though its Mokshagna Movie

Mokshagna – Prasanth Varma : హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ కూడా అది నిజమే అన్నారు హింట్స్ ఇస్తూ వచ్చాడు. మోక్షజ్ఞ కూడా ఇటీవల హీరో లుక్స్ లో కొత్త ఫోటోషూట్ చేయడంతో ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే నిన్న ప్రశాంత్ వర్మ సింబా వస్తున్నాడు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి సింబా రాబోతున్నాడు అని పోస్ట్ చేయడంతో బాలయ్య తనయుడి సినిమానే అని అంతా అనుకున్నారు.

Also Read : The GOAT : ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)మూవీ రివ్యూ.. విజయ్ చివరి సినిమా ఎలా ఉంది?

తాజాగా నేడు మరో పోస్టర్ ని రిలీజ్ చేసారు. సింబా ఈజ్ కమింగ్ అంటూ ఉదయిస్తున్న సూర్యుడు కనపడేలా ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే మోక్షజ్ఞ మొదటి సినిమా టైటిల్ ‘సింబా’నే అవ్వొచ్చు అనిపిస్తుంది. ఈ పోస్టర్ ని షేర్ చేసి.. లెగసీని ముందుకు తీసుకెళ్లే టైం వచ్చింది. రేపు ఉదయం 10 గంటల 36 నిమిషాలకు సింబా వస్తున్నాడు అంటూ పోస్ట్ చేసాడు.

Image

ఈ పోస్ట్ తో కచ్చితంగా ఇది మోక్షజ్ఞ సినిమానే, బాలయ్య లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి సింబాగా వస్తున్నాడు అని అనుకుంటున్నారు అభిమానులు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో హనుమాన్ తర్వాత ఇదే సినిమా రాబోతుందని ఈ పోస్టర్ తో అర్ధమవుతుంది. మరింత క్లారిటీ రావాలంటే రేపటి దాకా ఎదురుచూడాల్సిందే.